Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బెట్టింగ్‌ను చట్టబద్ధం చేస్తే లాభాలివే: ఐపీఎల్‌లో ఫిక్సింగ్‌పై ప్రీతిజింటా

IPL: Kings XI Punjab co-owner Preity Zinta wants betting to be legalised

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఏ ముహుర్తాన ప్రారంభించారో తెలియదు కానీ, గత పదకొండు సీజన్లుగా ఎన్నో వివాదాలను చూసింది. స్పాట్ ఫిక్సింగ్ కేసులో టీమిండియా పేసర్ శ్రీశాంత్ అరెస్టు కావడం దగ్గర నుంచీ గత సీజన్‌లో బాలీవుడ్ నటుడు అర్బాజ్ ఖాన్ బెట్టింగ్‌లో రూ. 2.80 కోట్ల వరకు ఎన్నో వివాదాలు ఈ టోర్నీని చుట్టుముట్టాయి.

విజయవంతమైన ఈ టోర్నీలో ఇలాంటి వివాదాలన్నింటికీ బాలీవుడ్ నటి, ఐపీఎల్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ప్రాంఛైజీ సహా యజమాని ప్రీతి జింటా ఓ పరిష్కారాన్ని కనుగొంది. ఇంతకీ ఆ పరిష్కారం ఏంటని అనుకుంటున్నారా? బెట్టింగ్‌ను చట్టబద్ధం చేయడమే. తద్వారా ఈ టోర్నీలో అవినీతి నిరోధించ వచ్చని ప్రీతిజింటా తెలిపారు.

బెట్టింగ్‌ను చట్టబద్ధం చేస్తే మంచిది

బెట్టింగ్‌ను చట్టబద్ధం చేస్తే మంచిది

బెట్టింగ్‌ను చట్టబద్ధం చేయడం ద్వారా ఇది ఓ ప్రధాన ఆదాయ వనరుగా మారడంతో పాటు బెట్టింగ్‌కు పాల్పడటం ద్వారా నమోదయ్యే కేసులు కూడా తగ్గుముఖం పడతాయని ఈ సందర్భంగా ప్రీతిజింటా చెప్పుకొచ్చారు. ఆటగాళ్లు స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడకుండా ఉండేందుకు గాను ఐపీఎల్ విధివిధానాల్లో లై డిటెక్టర్ పరీక్షను సైతం చేరిస్తే బాగుంటుందని సలహా ఇచ్చారు.

బెట్టింగ్ చట్టబద్ధం చేస్తే లాభమిదే

బెట్టింగ్ చట్టబద్ధం చేస్తే లాభమిదే

ఇండియా టుడేకి ఇచ్చిన ఇంటర్యూలో ప్రీతి జింటా మాట్లాడుతూ "బెట్టింగ్‌ను ప్రభుత్వం చట్టబద్ధం చేస్తే బాగుంటుంది. దీంతో ఇదొక ప్రధాన ఆదాయ వనరుగా ఏర్పడుతుంది. బెట్టింగ్‌కు పాల్పడుతున్న వారిలో ఎంతమందిని అని మనం కంట్రోల్ చేయగలం. ఐపీఎల్ పాలసీల్లో లై డిటెక్టర్ టెస్టుని కూడా చేర్చాలి" అని పేర్కొన్నారు.

తప్పకుండా పోలీసులను ఆశ్రయిస్తా

తప్పకుండా పోలీసులను ఆశ్రయిస్తా

"అలా చేస్తే ఇదొక అద్భుతమే. దీని కారణంగా ప్రతి ఒక్కరూ భయపడతారు. ఫిక్సింగ్‌కు చేయాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు. ఎవరైనా ఫిక్సింగ్ ఆఫర్‌తో నా వద్దకు వస్తే నేను తప్పకుండా పోలీసులను ఆశ్రయిస్తా. నేను చెప్పేది అర్ధం చేసుకోండి, ప్రస్తుతం నేనేమీ సినిమాల్లో నటించడం లేదు" అని ప్రీతిజింటా తెలిపారు.

పదేళ్ల పాటు స్టూడియోల్లో, సినిమాల్లో నటించా

పదేళ్ల పాటు స్టూడియోల్లో, సినిమాల్లో నటించా

"పదేళ్ల పాటు నేను స్టూడియాల్లో, సినిమాల్లోని పాత్రల్లో కోసం కెమెరాల ముందు నటించాను. ప్రస్తుతం నేను లా లా ల్యాండ్‌లో నివసిస్తున్నాను. ఉన్నట్టుండి ఒక్కసారిగా క్రికెట్‌ మైదానంలో అడుగుపెట్టాను. అయితే, ఇక్కడ ఏం జరుగుతుందో నాకు అసలు అర్ధం కావడం లేదు" ప్రీతిజింటా వెల్లడించారు.

Story first published: Monday, October 8, 2018, 15:07 [IST]
Other articles published on Oct 8, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+