న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎలే బెస్ట్ లీగ్: ఆరెంజ్ క్యాప్ అందుకున్న తర్వాత డేవిడ్ వార్నర్

IPL 2019 : IPL Is The Best League In The World,Says David Warner || Oneindia Telugu
IPL is the best league in the world, says SRH batsman David Warner

హైదరాబాద్: ప్రపంచంలోనే ఐపీఎల్ బెస్ట్ లీగ్ అంటూ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఓపెనర్ డేవిడ్ వార్నర్ కితాబిచ్చాడు. బాల్ టాంపరింగ్ కారణంగా గత ఐపీఎల్ సీజన్‌కు డేవిడ్ వార్నర్ దూరమైన సంగతి తెలిసిందే. అయితే, ఈ సీజన్‌లో డేవిడ్ వార్నర్ అద్భుతమైన పునరాగమనం చేశాడు. ఐపీఎల్ 12వ సీజన్‌లో డేవిడ్ వార్నర్ ఆరెంజ్ క్యాప్‌ని సొంతం చేసుకున్నాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ 2019 ప్రత్యేక వార్తల కోసం

12 మ్యాచ్‌లాడి 692 పరుగులు

12 మ్యాచ్‌లాడి 692 పరుగులు

ఈ సీజన్‌లో మొత్తం 12 మ్యాచ్‌లాడిన డేవిడ్ వార్నర్ 692 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, ఎనిమిది హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ సీజన్‌లో డేవిడ్ వార్నర్ అద్భుతమైన ఫామ్‌లో కొనసాగడంతో పాటు సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. ఈ క్రమంలో వార్నర్ యావరేజి 69.20గా నమోదు కాగా, స్ట్రయిక్ రేట్ 143.86గా ఉంది.

692 పరుగులతో అగ్రస్థానంలో

692 పరుగులతో అగ్రస్థానంలో

31 ఏళ్ల వార్నర్ లీగ్ స్టేజి ముగిసే సమయానికి 692 పరుగులతో అగ్రస్థానంలో నిలిచాడు. ఆ తర్వాత ఐపీఎల్ ఫ్లేఆఫ్స్ ముగిసినప్పటికీ వార్నర్ స్కోరుని ఏ బ్యాట్స్‌మెన్ కూడా అందుకోలేకపోయాడు. లీగ్ స్టేజిలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆడిన 14 మ్యాచ్‌ల్లోనూ డేవిడ్ వార్నర్ ఆడలేదు. అందుకు కారణం వరల్డ్‌కప్ సన్నాహాకాల్లో భాగంగా సొంత దేశానికి పయనమవడమే.

డేవిడ్ వార్నర్ ఎమోషనల్ మెసేజ్‌

డేవిడ్ వార్నర్ ఎమోషనల్ మెసేజ్‌

ఐపీఎల్‌ను వీడే సమయంలో కూడా డేవిడ్ వార్నర్ ఎమోషనల్ మెసేజ్‌ని అభిమానులతో షేర్ చేసుకున్నాడు. తాజాగా ఆరెంజ్ క్యాప్(టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడికి ఇచ్చే క్యాప్) అందుకున్నందుకు గాను వార్నర్ తన సందేశాన్ని వీడియో రూపంలో పంపాడు.

ఆరెంజ్ క్యాప్ గెలవడం గౌరవంగా ఉంది

ఆరెంజ్ క్యాప్ గెలవడం గౌరవంగా ఉంది

"ఆరెంజ్ క్యాప్ గెలవడం గౌరవంగా ఉంది. బ్యాట్స్‌మెన్‌గా అవార్డులు గెలిచేందుకు ఈ గేమ్ ఆడటం లేదు, విజయం సాధించేందుకే. ఈ క్రెడిట్ మొత్తం హైదరాబాద్ క్యూరేటర్స్‌కే చెందుతుంది. ఈ టోర్నమెంట్‌లో భాగస్వామిని అయినందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రపంచంలోని బెస్ట్ లీగ్‌ల్లో ఇదొకటి. థ్యాంక్యూ వెరీ మచ్" అంటూ వార్నర్ అన్నాడు.

Story first published: Tuesday, May 14, 2019, 15:25 [IST]
Other articles published on May 14, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X