Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

హైదరాబాద్ లో ఐపియల్ కు తెలంగాణ దెబ్బ

Lalit Modi
హైదరాబాద్: హైదరాబాదులోని ఐపియల్ పై తెలంగాణ దెబ్బ పడింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపియల్) ఆరంభోత్సవ వేడుకలు హైదరాబాదు నుంచి ముంబైకి తరలిపోయాయి. ఈ వేడుకలను హైదరాబాదులోని నిర్వహించాలని రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ (డిజిపి) గిరీష్ కుమార్ లలిత్ మోడీని కోరారు. అయితే తమకు అందుకు సమయం కావాలని, ఆలోచించుకుంటామని లలిత్ మోడీ చెప్పినట్లు సమాచారం. అయితే ఆ వేడుకలను హైదరాబాదులోని తలపెట్టే సాహసానికి ఐపియల్ సాహసించే పరిస్థితి లేదు. ఆరంభ వేడుకల రోజు దక్కన్ చార్జర్స్ కు, కోల్ కత్తా నైట్ రైడర్స్ కు మధ్య జరగాల్సిన మ్యాచు కూడా ముంబైకి తరలిపోయింది. మరిన్ని రోజులు ఇదే పరిస్థితి కొనసాగితే మొత్తం దక్కన్ చార్జర్స్ తో జరిగే మ్యాచులు కూడా ఇతర రాష్ట్రాలకు తరలిపోయే ప్రమాదం ఉంది. తొలి మ్యాచు ముంబైకి తరలిపోవడంతో మిగిలి ఆరు మ్యాచుల్లో నాలుగు హైదరాబాదులో, రెండు విశాఖలో జరగాల్సి ఉంది. అయితే ఈ మ్యాచులు కూడా రాష్ట్రంలో జరగడం అనుమానాస్పదంగానే ఉంది.ఈ మ్యాచులు కూడా ఇతర రాష్ట్రాలకు తరలిపోవచ్చునని హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్ సిఎ) అనుమానిస్తోంది.

గురువారం హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియంలో జరిగిన ట్వంటీ20 మ్యాచును తెలంగాణ విద్యార్థులు అడ్డుకున్నారు. దీంతో ఐపియల్ మ్యాచుల నిర్వహణకు ఎదురయ్యే ఇబ్బందులను గుర్తించి వేదికలను మార్చే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. ఆరంభ మ్యాచు, వేడుకలు తమకు ఎంతో ముఖ్యమని, ఆరంభం రోజు రాత్రి జరిగే విందుకు ప్రపంచం మొత్తం మీది నుంచి ఎంతో మంది ప్రముఖులు వస్తారనిి, దీన్ని సజావుగా నిర్వహించడం తమ బాధ్యత అని, అందువల్ల తాము సాహసం చేయలేమని ఐపియల్ కమిషనర్ లలిత్ మోడీ అన్నారు. దక్కన్ చార్జర్స్ తో మిగతా మ్యాచులు యధావిధిగా సాగుతాయని లలిత్ మోడీ చెబుతున్నప్పటికీ వాటి విషయంలో కూడా అనుమానాలు పొడసూపుతూనే ఉన్నాయి.
Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+