2008 To 2018 వరకు చరిత్ర: గత 11 సీజన్లలో ఐపీఎల్ విజేతలు వీరే

హైదరాబాద్: ఐపీఎల్ 2018 సీజన్ ఆదివారంతో ముగిసింది. టోర్నీలో భాగంగా ముంబైలోని వాంఖడె స్టేడియంలో జరిగిన పైనల్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించిన చెన్నై ముచ్చటగా మూడోసారి కప్‌ను ముద్దాడింది.
రెండేళ్ల విరామం తర్వాత ఐపీఎల్ టోర్నీలోకి అడుగుపెట్టిన చెన్నై సూపర్ కింగ్స్ ఈ సీజన్‌లో టైటిల్ విజేతగా నిలవడం... అభిమానుల ఆనందాన్ని రెట్టింపు చేసింది. 2008లో ఆరంభమైన ఈ లీగ్‌కు క్రికెట్ ప్రేమికులు బ్రహ్మరథం పట్టడంతో ప్రతిఏడాది టోర్నీ విజయవంతంగా సాగుతోంది. ఐపీఎలో 11వ సీజన్ ముగిసిన నేపథ్యంలో ఐపీఎల్ ఆరంభమైనప్పటి నుంచి విజేతల వివరాలు మీకోసం..

2018: చెన్నై సూపర్ కింగ్స్
రెండేళ్ల విరామం తర్వాత ఐపీఎల్‌లోకి పునరాగమనం చేసిన చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ విజేతగా నిలిచింది. ధోని నాయకత్వంలోని చెన్నై వాంఖడెలో జరిగిన ఫైనల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 8వ వికెట్ల తేడాతో విజయం సాధించి మూడోసారి ట్రోఫీని ముద్దాడింది.

2017: ముంబై ఇండియన్స్
ఐపీఎల్ పదో సీజన్‌ను ప్రేక్షుకలను ఎంతగానో అలరించింది. ఈ సీజన్‌లో రోహిత్ శర్మ నాయకత్వంలోని ముంబై ఇండియన్స్ టైటిల్ విజేతగా నిలిచింది. ఫైనల్లో పుణేపై 130 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకొని చివరి బంతికి విజయం సాధించింది.

2016: సన్‌రైజర్స్ హైదరాబాద్
ఐపీఎల్ 9వ సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టైటిల్ విజేతగా నిలిచింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఫైనల్లో విరాట్ కోహ్లీ నాయకత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుని ఓడించిన డేవిడ్ వార్నర్ సేన తొలిసారి ఐపీఎల్ ట్రోఫీ గెలుచుకుంది.

2015: ముంబై ఇండియన్స్
ధోని నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన ఐపీఎల్ ఫైనల్లో ముంబై ఇండియన్స్ 41 పరుగుల తేడాతో విజయం సాధించి రెండోసారి ఐపీఎల్ ట్రోఫీని అందుకుంది.

2014: కోల్‌కతా నైట్‌రైడర్స్
గౌతమ్ గంభీర్ నాయకత్వంలోని కోల్‌కతా నైట్‌రైడర్స్ రెండోసారి ట్రోఫీని అందుకుంది. ఫైనల్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుపై కోల్‌కతా మూడు వికెట్ల తేడాతో విజయం సాధించి ట్రోఫీని కైవసం చేసుకుంది.

2013: ముంబై ఇండియన్స్
ధోనీ నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్‌ని ఐపీఎల్ ఫైనల్లో ముంబై ఇండియన్స్ ఓడించింది. ఈ మ్యాచ్‌లో 23 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ విజయం సాధించి ఐపీఎల్ ట్రోఫీని తొలిసారి సొంతం చేసుకుంది.

2012: కోల్‌కతా నైట్‌రైడర్స్
ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ తొలిసారి ఐపీఎల్ విజేతగా నిలిచింది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలో దిగిన చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన ఫైనల్లో ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

2011: చెన్నై సూపర్ కింగ్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్ తన అద్భుత ఆటతీరుతో రెండోసారి ఐపీఎల్ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్‌పై 58 పరుగుల తేడాతో ఆ జట్టు విజయం సాధించింది.

2010: చెన్నై సూపర్ కింగ్స్
ధోని నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ తొలిసారి ఐపీఎల్ విజేతగా అవతరించింది. ఫైనల్లో ముంబై ఇండియన్స్‌పై ధోని సేన విజయం సాధించి ఐపీఎల్ ట్రోఫీని కైవసం చేసుకుంది.

2009: డెక్కన్ ఛార్జర్స్
భారత్‌లో సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా ఆ ఏడాది ఐపీఎల్ ట్రోఫీని దక్షిణాఫ్రికాలో నిర్వహించారు. ఫైనల్లో బెంగళూరుపై ఆరు వికెట్ల తేడాతో గెలిచిన డెక్కన్ ఛార్జర్స్ జట్టు ఐపీఎల్ విజేతగా నిలిచింది.

2008: రాజస్థాన్ రాయల్స్
2008లో ప్రారంభమైన తొలి ఐపీఎల్ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు టైటిల్ విజేతగా నిలిచింది. షేన్ వార్న్ నాయకత్వంలోని రాజస్థాన్ ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్‌పై మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications