Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SRH vs RR: మ్యాచ్ హైలెట్స్ వీడియో చూశారా?

IPL Highlights, SRH vs RR: Dhawan, Williamson Guide SRH To 9-Wicket Win Over RR

హైదరాబాద్: సొంతగడ్డపై సన్‌రైజర్స్ హైదరాబాద్ అద్భుత ప్రదర్శన చేసింది. సోమవారం ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతిత తెలిసిందే. కేన్ విలియమన్స్ సారథ్యంలోని సన్‌రైజర్స్ బౌలింగ్, ఫీల్డింగ్, బ్యాటింగ్ ఇలా అన్ని రంగాల్లో సత్తా చాటింది.

సన్‌రైజర్స్ హైదరాబాద్ పూర్తి షెడ్యూల్

తద్వారా ఐపీఎల్ 11వ సీజన్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘనంగా ప్రారంభించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ విలియమ్సన్ రాజస్థాన్ రాయల్స్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. భువనేశ్వర్(1/30), స్టాన్‌లేక్(1/29) స్వింగ్ బౌలింగ్‌తో రాజస్థాన్ రాయల్స్ జట్టును 125 పరుగులకే కట్టడి చేసిన సంగతి తెలిసిందే.

అనంతరం 126 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ ఓపెనర్ శిఖర్ ధావన్(77 నాటౌట్) బ్యాటింగ్‌తో అభిమానులను అలరించాడు. ధావన్ తన ట్రేడ్‌మార్క్ షాట్లతో బౌండరీలు బాది సన్‌రైజర్స్‌కు విజయాన్ని అందించాడు. దీంతో తొలి మ్యాచ్‌లో సన్ రైజర్స్ 9 వికెట్ల తేడాతో రాజస్థాన్‌పై ఘన విజయం సాధించింది.

మరోవైపు కెప్టెన్ కేన్ విలియమ్సన్(36 నాటౌట్)తో రెండో వికెట్‌కు శిఖర్ ధావన్ 121 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ అన్ని విభాగాల్లోనూ అలరించింది. తొలి ఓవర్ చివరి బంతికి లేని పరుగు కోసం ప్రయత్నించిన ఓపెనర్ షార్ట్‌ను విలియమ్సన్ రనౌట్ చేసిన తీరు అద్భుతం. సన్‌రైజర్స్ Vs రాజస్థాన్ మ్యాచ్ హైలెట్స్ వీడియో మీకోసం...

Story first published: Tuesday, April 10, 2018, 16:38 [IST]
Other articles published on Apr 10, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+