పవర్ ప్లేలో పరుగులు సాధించి చతికిలబడ్డ జట్లు ఇవే

హైదరాబాద్: ఆరంభం అదరగొట్టి క్రమేపి చప్పని ఆటతీరు ప్రదర్శించింది రాజస్థాన్ జట్టు. మంగళవారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన కోల్‌కతా, రాజస్థాన్‌ల సమరంలో ప్లేఆఫ్ ఆశలను వాయిదా వేసుకుంది రాజస్థాన్. హ్యాట్రిక్ విజయాలతో ప్లే ఆఫ్ రేసులోకి దూసుకొచ్చిన రాజస్థాన్ రాయల్స్‌కు కోల్‌కతా నైట్‌రైడర్స్ కళ్లెం వేసిన సంగతి తెలిసిందే. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ రాయల్స్‌కు ఓపెనర్లు మెరుపు ఆరంభం ఇచ్చారు.
భీకర ఫామ్‌లో ఉన్న బట్లర్ (36), అతనికి తోడుగా వచ్చిన రాహుల్ త్రిపాఠి (27) పూనకం వచ్చినట్లుగా కోల్‌కతా బౌలర్లపై విరుచుకుపడ్డారు. వీరిద్దరి ధాటికి రాజస్థాన్ రాయల్స్‌కు ఐదు ఓవర్లు ముగిసే లోపే స్కోరుబోర్డుపై 60పరుగులు వచ్చి చేరాయి. కానీ అనూహ్యంగా ఐదో ఓవర్ చివరి బంతికి త్రిపాఠి వెనుదిరగడం..తర్వాతి బ్యాట్స్‌మెన్ కూడా వెంటవెంటనే వరుస కట్టడంతో రాజస్థాన్ ఇన్నింగ్స్ 19ఓవర్లకే ముగిసేసరికి 142పరుగులతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అనంతరం కోల్‌కతా 18ఓవర్లకే లక్ష్యాన్ని ఛేదించి ఆరు వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని కైవసం చేసుకుంది.

కోల్‌కతా నైట్‌రైడర్స్ ముందుంది:
అయితే ఐపీఎల్‌లో ఇలా పవర్‌ప్లేలో మెరుగైన ఆరంభం లభించినా.. ఇన్నింగ్స్ ముగిసేసరికి తక్కువ పరుగులకే పరిమితం కావడం తొలిసారేమీ కాదు. ఈ వరుసలో ముందున్న జట్టుగా నిజానికి కోల్‌కతా నైట్‌రైడర్స్ ముందుంది. రాజస్థాన్ రాయల్స్ పవర్‌ప్లేలో 60పరుగులు సాధించినా..ఇన్నింగ్స్ ముగిసేసరికి తక్కువ పరుగులతోనే సరిపెట్టుకున్న రెండో జట్టుగా నిలిచింది.

2017లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో:
2017లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతాకు పవర్‌ప్లేలో 60పరుగులు దాటినా..ఆ జట్టు చివరికి 131పరుగులకే పరిమితం కావాల్సి వచ్చింది.

2010లో ముంబై ఇండియన్స్‌తో
2010లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఛేదనకు దిగిన దిల్లీ డేర్‌డెవిల్స్ కూడా పవర్‌ప్లేలో 60పరుగుల మార్కు దాటుకుంది. కానీ చివరికి 144 పరుగులతో సరిపెట్టుకుంది.

2011లో చెన్నై సూపర్‌కింగ్స్‌తో
2011లో చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ దక్కన్ ఛార్జర్స్ ఇదే పరిస్థితి ఎదుర్కొవాల్సి వచ్చింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన చెన్నై నిర్ణీత 20ఓవర్లలో 165పరుగులు సాధించింది. అనంతరం ఛేదనకు దిగిన దక్కన్ ఛార్జర్స్ మొదటి 6ఓవర్లలోపు 60కంటే ఎక్కువ పరుగులే సాధించినా..ఆఖరికి 146పరుగులతో ఆగిపోయింది.

అప్పుడు కూడా ఇలానే:
ఐపీఎల్ తొలి సీజనులోనూ(2008) కోల్‌కతా నైట్‌రైడర్స్, చెన్నై సూపర్‌కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లోనూ.. ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్‌కతా పవర్‌ప్లేలో 60పరుగులు సాధించింది. కానీ మిగతా బ్యాట్స్‌మెన్ తడబడటంతో చివరికి 147పరుగులతోనే సరిపెట్టుకుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications