For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

చిత్తుగా ఓడిన పంజాబ్: ఐపీఎల్‌లో కోల్‌కతాకు రెండో విజయం

KXIP

హైదరాబాద్: ఐపీఎల్ 2019 సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ రెండో విజయాన్ని నమోదు చేసింది. బుధవారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో 28 పరుగుల తేడాతో విజయం సాధించింది. సొంతగడ్డపై కోల్‌కతాకు ఇది రెండో విజయం కావడం విశేషం. కోల్‌కతా నిర్దేశించిన 219 పరుగుల విజయ లక్ష్యాన్ని చేధించే క్రమంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 190 పరుగులకే పరిమితమైంది. పంజాబ్ జట్టులో మయాంక్ అగర్వాల్ (58: 33 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్స్), డేవిడ్ మిల్లర్ (59 నాటౌట్: 40 బంతుల్లో 5 పోర్లు, 3 సిక్సులు) హాఫ్ సెంచరీలతో రాణించినప్పటికీ.. జట్టుకు విజయాన్ని అందించలేకపోయారు.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

అంతకముందు ఆండ్రీ రసెల్ (48: 17 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సులు), రాబిన్ ఉతప్ప (67 నాటౌట్: 50 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సులు), నితీశ్ రాణా (63: 34 బంతుల్లో 2 ఫోర్లు, 7 ఫోర్లు) చెలరేగడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్ 4 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది.

కోల్‌కతా ఓపెనర్ క్రిస్‌లిన్ (10) నిరాశపరిచినా.. మరో ఓపెనర్ సునీల్ నరైన్ (24) క్రీజులో ఉన్నంతసేపూ బౌండరీల మోత మోగించాడు. ఓవర్ వ్యవధిలో ఇద్దరూ పెవిలియన్ చేరగా ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రాబిన్ ఉతప్ప, నితీశ్ రాణా మూడో వికెట్‌కి అభేద్యంగా 110 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

1
45762

జట్టు స్కోరు 146 వద్ద రాణా ఔటవగా ఇన్నింగ్స్ 15వ ఓవర్‌లో క్రీజులోకి వచ్చిన రస్సెల్ బౌండరీలతో విరుచుకుపడ్డాడు. నిజానికి ఇన్నింగ్స్ 17వ ఓవర్‌లో 4 పరుగుల వద్ద రస్సెల్ ఔటయ్యాడు. మహ్మద్ షమీ విసిరిన యార్కర్‌కు క్లీన్ బౌల్డయ్యాడు. అయితే, 30 అడుగుల సర్కిల్‌లో ముగ్గురు ఫీల్డర్లు మాత్రమే ఉండంతో ఆ బంతిని అంపైర్ నోబాల్‌గా ప్రకటించాడు.

తనకు లభించిన లైఫ్‌తో రస్సెల్ పరుగుల సునామీ సృష్టించాడు. పంజాబ్ బౌలర్లలో షమీ, వరుణ్ చక్రవర్తి, విజిలియన్, ఆండ్రూ టై తలో వికెట్ తీశారు.

Story first published: Wednesday, March 27, 2019, 23:47 [IST]
Other articles published on Mar 27, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+