Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సన్‌రైజర్స్ హైదరాబాద్ హ్యాట్రిక్: ఢిల్లీపై 5 వికెట్ల తేడాతో విజయం

IPL 2019: Sunrisers Hyderabad Defeat's Delhi Capitals By 5 Wickets | Match Highlights!!
SRH

హైదరాబాద్: ఐపీఎల్ 2019 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. ఫిరోజ్ షా కోట్లా వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తాజా విజయం సన్‌రైజర్స్‌కు వరుసగా మూడో విజయం కాగా... ఆరు పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

ఢిల్లీ క్యాపిటల్స్ నిర్దేశించిన 130 పరుగుల విజయ లక్ష్యాన్ని సన్‌రైజర్స్ హైదరాబాద్ 18.3 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి చేధించింది. సన్‌రైజర్స్ ఓపెనర్లలో జానీ బెయిర్ స్టో (48; 28 బంతుల్లో 9 ఫోర్లు, ఒక సిక్స్) జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఢిల్లీ బౌలర్లలో లమిచానే, అక్షర పటేల్, రబాడ, తెవాటియా, ఇషాంత్ శర్మ తలో వికెట్ తీశారు.

అంతకముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు 129 పరుగులు చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో ఓపెనర్లు పృథ్వీషా(11), శిఖర్‌ధావన్‌(12) స్వల్ప స్కోరుకే పెవిలియన్‌కు చేరారు. దీంతో 36 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది.

1
45772

ఆ తర్వాత కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌(43), రిషభ్‌ పంత్‌(5)తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దేందుకు ప్రయత్నం చేశాడు. అయితే, 5 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పంత్ మహ్మద్ నబీ బౌలింగ్‌లో దీపక్ హుడాకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. పిచ్‌ బౌలర్లకు అనుకూలంగా మారడంతో ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన మిగతా బ్యాట్స్‌మెన్‌ స్వల్ప స్కోర్లకే ఔటయ్యారు.

మరోవైపు శ్రేయస్‌ అయ్యర్‌ నిలకడగా ఆడుతూ స్కోరు బోర్డుని నడిపించాడు. దాంతో ఢిల్లీ స్కోరు వంద దాటడం కూడా కష్టమే అనిపించింది. చివర్లో అక్షర్‌ పటేల్‌(23 నాటౌట్‌), క్రిస్‌ మోరిస్‌(17) దూకుడుగా ఆడటంతో ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది.

సన్‌రైజర్స్‌ బౌలర్లు భువనేశ్వర్‌, మహ్మద్‌ నబీ, సిద్ధార్థ్‌కౌల్‌ రెండేసి వికెట్లు తీయగా రషీద్‌ఖాన్‌, సందీప్‌శర్మ చెరో వికెట్‌ పడగొట్టారు.

జట్ల వివరాలు:
సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌:
భువనేశ్వర్‌ కుమార్‌(కెప్టెన్‌), డేవిడ్‌ వార్నర్‌, జానీ బెయిర్‌స్టో(వికెట్‌ కీపర్‌), విజయ్‌ శంకర్‌, మనీశ్‌పాండే, దీపక్‌ హుడా, మహమ్మద్‌ నబీ, రషీద్ ఖాన్, సందీప్‌ శర్మ, సిద్ధార్థ్ కౌల్‌.

ఢిల్లీ క్యాపిటల్స్‌: శ్రేయస్‌ అయ్యర్‌(కెప్టెన్‌), పృథ్వీ షా, శిఖర్‌ ధావన్‌, రిషభ్‌ పంత్‌(వికెట్‌ కీపర్‌), ఇన్‌గ్రామ్‌, క్రిస్‌ మోరిస్‌, అక్షర్‌ పటేల్‌, కగిసో రబాడ, అవేశ్‌ ఖాన్‌, సందీప్‌ లమిచానే.

Story first published: Thursday, April 4, 2019, 23:38 [IST]
Other articles published on Apr 4, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+