Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2025 Hat trick: వీళ్లు మాములోళ్లు కాదు భయ్యో! - బ్యాటర్లకు యముడు లాంటోళ్లు!

టీ20 అంటేనే రసవత్తర మ్యాచ్‌లకు కేరాఫ్ అడ్రెస్. ఈ ఫార్మాట్ లో ఎప్పుడేం జరుగుతుందో ఊహించడం చాలా కష్టం. ధాటిగా ఆడే బ్యాటర్‌ ఊహించని విధంగా ఔటవ్వడం, ధారాళంగా పరుగులు సమర్పించుకునే బౌలర్‌ అనూహ్యంగా వికెట్లు తీయడం ఈ టీ20లో చూస్తుంటాం. ఐపీఎల్ లోనూ అంతే. ఒక్కసారిగా చెలరేగి రెప్పపాటులో మ్యాచ్ ఫలితాలను తారుమారు చేసే వీరులు ఉన్నారు. ముఖ్యంగా హ్యాట్రిక్‌ తో సంచనాలు సృష్టించిన ఆటగాళ్లు ఉన్నారు. మరో వారం రోజుల్లో కొత్త సీజన్‌ ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఇప్పటి వరకు ఈ సూపర్ మెగా టోర్నీలో ఎవరెవరు హ్యాట్రిక్‌లు సాధించారో నెమరువేసుకుందాం..

ఐపీఎల్‌లో తొలిసారి హ్యాట్రిక్ చేసిన హీరో ఎవరు?
లక్ష్మీపతి బాలాజి. టీ20 లీగ్‌లో తొలిసారి హ్యాట్రిక్‌ వికెట్లు సాధించిన బౌలర్‌గా నిలిచాడు. 2008 ప్రారంభ ఎడిషన్ లో బాలాజీ.. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో (5/24) బౌలింగ్ ఫిగర్ నమోదు చేశాడు. చివరి ఓవర్‌లో వరుస బంతుల్లో ఇర్ఫాన్ పఠాన్‌, పీయుష్‌ చావ్లా, విక్రమ్‌ సింగ్‌లను ఔట్ చేశాడు.

IPL Hat trick wicket takers list full ahead of IPL 2025

ఐపీఎల్‌లో ఏ బౌలర్ ఎక్కువ సార్లు హ్యాట్రిక్ తీశాడు?
ఐపీఎల్‌లో అత్యధికంగా మూడు సార్లు హ్యాట్రిక్‌ సాధించిన ఏకైక బౌలర్‌, భారత మాజీ లెగ్‌ స్పిన్నర్‌ అమిత్‌ మిశ్రా. 2008లో దిల్లీ తరఫున ఆడిన అతడు.. హైదారాబాద్‌ జట్టుపై (5/17) మొదటిసారి హ్యాట్రిక్‌ వికెట్లు తీశాడు. ఆ తర్వాత 2011లో పంజాబ్‌పై (4/9), 2013లో హైదారాబాద్‌ తరఫున ఆడిన అతడు.. పుణెపై (4/19) వికెట్లు తీశాడు.

ఏ సీజన్ లో ఎక్కువ హ్యాట్రిక్స్ నమోదు అయ్యాయి?
2008,2009,2017

ఒకే సీజన్ లో ఒకే ఆటగాడు రెండు సార్లు హ్యాట్రిక్...
దిగ్గజ మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ రెండుసార్లు హ్యాట్రిక్‌ అందుకున్న ఆటగాడిగా నిలిచాడు. అది కూడా ఒకే సీజన్ లో ఈ ఘనత సాధించాడు. 2009లో పంజాబ్‌ తరపున ఆడిన అతడు.. బెంగళూరుపై (3/22), ఆ తర్వాత డెక్కన్ ఛార్జర్స్ పై (3/13) వికెట్లు తీశాడు.

రోహిత్ శర్మ కూడా..
ప్రస్తుత ముంబయి కెప్టెన్ రోహిత్‌ శర్మ అంటే పవర్ హిట్టింగ్ ధనాధన్ బాదుడుకు కేరాఫ్ అడ్రెస్. కానీ అతడిలో బౌలింగ్ స్కిల్ కూడా ఉంది. 2009 మే6న డెక్కన్ ఛార్జర్స్ తరఫున ఆడిన అతడు.. ముంబయిపై కేవలం 2 ఓవర్లే బౌలింగ్‌ చేసి, 6 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు.


ఏకంగా 42 ఏళ్ల వయసులో..
2014లో 42 ఏళ్ల వయసులో రాజస్థాన్ తరఫున ఆడిన లెగ్ స్పిన్నర్ ప్రవీణ్ తాంబే.. కోల్ కతాపై హ్యాట్రిక్ తీశాడు. 2017లో ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహించిన సామ్యూల్.. ‌ ముంబయిపై హ్యాట్రిక్‌ (4/9) నమోదు చేశాడు. 2019లో పంజాబ్‌ కు ప్రాతినిధ్యం వహించిన సామ్‌ కరణ్‌ దిల్లీ జట్టుపై వరుసగా మూడు వికెట్లు తీశాడు. (4/11) మెరుగైన బౌలింగ్ గణాంంకాలను నమోదు ‌ చేశాడు. 2023లో గుజరాత్ కు ఆడిన రషీద్ ఖాన్.. కోల్ కతాపై హ్యాట్రిక్ చేసి అదరగొట్టాడు.
Story first published: Friday, March 14, 2025, 17:41 [IST]
Other articles published on Mar 14, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+