Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

క్రికెట్ ఫ్యాన్స్‌కు అద్దిరిపోయే న్యూస్: ఐపీఎల్‌ 2023 సీజన్ నుంచి షురూ: పెను మార్పులు

ముంబై: ప్రతి సంవత్సరం క్రికెట్ ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించే ఐపీఎల్ టోర్నమెంట్‌కు సంబంధించిన బిగ్ అప్‌డేట్ వెలువడింది. ఈ మెగా క్రికెట్ ఈవెంట్‌ షెడ్యూల్‌ను ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ పొడిగించింది. ఇకపై ఐపీఎల్ అక్షరాలా రెండున్నర నెలల పాటు కొనసాగుతుంది. దీనికి సంబంధించిన అనుమతులు ఐసీసీ నుంచి అధికారికంగా లభించినట్టే. ఐపీఎల్ 2023 సీజన్, 16వ ఎడిషన్ నుంచే ఇది ఆరంభం కావడం ఖాయంగా కనిపిస్తోంది.

 ఐసీసీ ఎఫ్టీపీ..

ఐసీసీ ఎఫ్టీపీ..

ఐసీసీ కొద్దిసేపటి కిందటే తన ఫ్యూచర్ టూర్స్ ప్రోగ్రామ్‌ను ప్రకటించింది. 2023 ఈ ప్రోగ్రామ్ మొదలవుతుంది. అయిదేళ్ల పాటు కొనసాగుతుంది. అంటే 2027 వరకూ ఈ ఎఫ్టీపీ అందుబాటులో ఉంటుంది. ఈ ప్రోగ్రామ్‌లో ఐపీఎల్‌తో పాటు బిగ్ బాష్ లీగ్ (బీబీఎల్), హండ్రెడ్ టోర్నమెంట్‌లను చేర్చింది. ఈ రెండింటినీ చేర్చడం వల్ల క్రికెట్ ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డులకు వెసలుబాటును కల్పించినట్టవుతుంది.

 రెండున్నర నెలల పాటు..

రెండున్నర నెలల పాటు..

ప్రస్తుతం ఐపీఎల్ టోర్నమెంట్ ఓ ఫిక్స్డ్ షెడ్యూల్‌లో సాగుతోన్న విషయం తెలిసిందే. మార్చి చివరి వారంలో ఆరంభమైన ఈ టోర్నమెంట్ మే చివరి వారంలో ముగుస్తుంది. ఇది రెండు నెలల షెడ్యూల్. దీన్ని పొడిగించడం కోసం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ కొద్దిరోజులుగా ప్రయత్నాలు సాగిస్తూ వస్తోన్న విషయం తెలిసిందే. కనీసం రెండున్నర నెలల వరకు ఈ టోర్నమెంట్‌ను పొడించాల్సి ఉంటుందంటూ ఐసీసీకి ప్రతిపాదనలను అందజేసింది.

బీసీసీఐ ప్రతిపాదనలకు..

బీసీసీఐ ప్రతిపాదనలకు..

కొత్త ఫ్రాంఛైజీలను తీసుకోవాల్సి ఉన్నందున మ్యాచ్‌ల సంఖ్య పెరుగుతుందని, దీనికి అనుగుణంగా దీని షెడ్యూల్‌ను రెండున్నర నెలలకు పొడించాలని కోరుతూ వస్తోంది. దీనికి ఐసీసీ అనుమతి లభించినట్టయింది. దీనితో 2023 నుంచి 2027 వరకు ఈ అయిదేళ్ల కాలంలో ఐపీఎల్ టోర్నమెంట్ నడుస్తున్నప్పుడు అంతర్జాతీయ క్రికెట్ షెడ్యూల్స్ దాదాపు ఉండకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. దీని తరువాత హండ్రెడ్ లీగ్ టోర్నమెంట్స్, అనంతరం బిగ్ బాష్ లీగ్స్‌ షెడ్యూల్ కానున్నాయి. ఫలితంగా వేర్వేరు దేశాలకు చెందిన క్రికెటర్లు ఆయా ఈవెంట్లల్లో ఆడే వెసలుబాటు కలిగినట్టయింది.

 మ్యాచ్‌ల సంఖ్య ఇలా..

మ్యాచ్‌ల సంఖ్య ఇలా..

దీని ప్రకారం చూసుకుంటే- ఐపీఎల్ 2023, ఐపీఎల్ 2024 సీజన్‌లో 74, ఐపీఎల్ 2025‌, ఐపీఎల్ 2026లో 84, ఐపీఎల్ 2027లో 94 మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉంది. హండ్రెడ్ లీగ్ టోర్నమెంట్ విషయానికి వస్తే- జులై నుంచి ఆగస్టు మధ్యకాలంలో ఇది షెడ్యూల్ కావచ్చు. వేర్వేరు దేశాలకు చెందిన పించ్ హిట్టర్లు ఈ వంద బంతుల టోర్నీలో పాల్గొనే వీలు కలిగింది. కాగా- వెస్టిండీస్‌లో జరిగే కరేబియన్ ప్రీిమియర్ లీగ్, బంగ్లాదేశ్‌లో ఏర్పాటయ్యే బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్, పాకిస్తాన్ నిర్వహిస్తోన్న సూపర్ లీగ్ టోర్నీలను కూడా పరిశీలనలోకి తీసుకుంది.

Story first published: Saturday, July 16, 2022, 14:15 [IST]
Other articles published on Jul 16, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+