Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కేఎల్‌ రాహుల్‌ని హత్తుకున్న పాండ్య సోదరులు (వీడియో)

IPL: Hardik Pandya Hugs KL Rahul After Getting century

టీమిండియా జట్టులో చోటు ఆశిస్తున్న కేఎల్‌ రాహుల్‌ని హార్దిక్‌ పాండ్య, కృనాల్ పాండ్యలు హత్తుకుని అభినందించారు. ముంబై ఇండియన్స్‌, కింగ్స్‌ ఎలెవన్ పంజాబ్‌ జట్ల మధ్య బుధవారం రాత్రి జరిగిన ఉత్కంఠ మ్యాచ్‌లో చివరి బంతికి ముంబై విజయం సాధించింది.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 197 పరుగుల భారీ స్కోర్ చేసింది. పంజాబ్‌ ఓపెనర్ కేఎల్‌ రాహుల్‌ ( 100 నాటౌట్‌; 64 బంతుల్లో 6×4, 6×6) సెంచరీ చేసి పంజాబ్‌ ఇన్నింగ్స్ లో కీలక పాత్ర పోషించాడు. హార్దిక్‌ పాండ్య వేసిన 19వ ఓవర్‌లో ఏకంగా 25 పరుగులు పిండాడు. దీంతో పంజాబ్‌ భారీ స్కోర్‌ సాధించింది.

IPL: Hardik Pandya Hugs KL Rahul After Getting century

పంజాబ్‌ ఇన్నింగ్స్‌ అనంతరం.. మొదటగా కృనాల్ పాండ్య రాహుల్‌ను హత్తుకొని అభినందించాడు. ఆపై హార్దిక్‌ పాండ్య కూడా హత్తుకొని మెచ్చుకున్నాడు. దీంతో పాండ్య సోదరులు క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించారు. ముఖ్యంగా తన ఓవర్లో చితక బాదినా కూడా.. హార్దిక్‌ పాండ్య అభినందించడం విశేషం. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అయింది. అభిమానులు తమదైన స్టయిల్లో కామెంట్లు పెడుతున్నారు.

Story first published: Thursday, April 11, 2019, 18:51 [IST]
Other articles published on Apr 11, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+