Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కరోనా ఎఫెక్ట్.. ఐపీఎల్ వాయిదాపై శనివారం తుది నిర్ణయం!!

IPL Governing Council to meet on Saturday to discuss coronavirus threat

ముంబై: చైనాలో పుట్టిన ప్రమాదకర కరోనా వైరస్‌ (కొవిడ్-19) ప్రపంచాన్ని వణికిస్తున్న విషయం తెలిసిందే. కరోనా కారణంగా ఇప్పటికే పలు క్రీడా టోర్నీలు వాయిదా పడగా.. మరికొన్ని అదే బాట పడుతున్నాయి. ఈ కరోనా ప్రభావం ఇప్పుడు క్రికెట్‌పై కూడా పడింది. కరోనా కారణంగా బంగ్లాదేశ్‌ పితామహుడు షేక్‌ ముజీబుర్‌ రెహ్మాన్‌ శత జయంతి సందర్భంగా బంగ్లాదేశ్‌ ఘనంగా నిర్వహించాలనుకున్న ఆసియా XI, ప్రపంచ XI టీ20 మ్యాచులు వాయిదా పడ్డాయి. ఇక మార్చి 29న ప్రారంభం కానున్న ప్రతిష్టాత్మక ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 2020పై ఒకింత సందిగ్ధత కొనసాగుతూనే ఉన్నది.

సమావేశం కానున్న ఐపీఎల్ పాలక మండలి

సమావేశం కానున్న ఐపీఎల్ పాలక మండలి

కరోనా భారత్‌లో కూడా వేగంగా వ్యాప్తిచెందుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే 60పైగా కేసులు నమోదయ్యాయి. కరోనా వేగంగా వ్యాపిస్తుండటంతో ఐపీఎల్‌ను నిర్వహించవద్దని మద్రాసు హైకోర్టులో ఇప్పటికే పిటిషన్‌ దాఖలు కాగా.. ఐపీఎల్‌ మ్యాచ్‌ల నిర్వహణకు పలు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కూడా వ్యతిరేకత పెరుగుతోంది. దీంతో ఐపీఎల్‌ నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. అయితే ఐపీఎల్ పాలక మండలి శనివారం సమావేశం కానుందని సమాచారం తెలుస్తోంది. ఈ సమావేశంలో కరోనా ముప్పుపై చర్చించి తుది నిర్ణయం తీసుకుంటారట. ఇదే విషయాన్ని ఐపీఎల్ చైర్మన్ బ్రిజేష్ పటేల్ బుధవారం ధృవీకరించారు.

శనివారం తుది నిర్ణయం

శనివారం తుది నిర్ణయం

'ప్రస్తుతం మేము కరోనా వైరస్‌ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాం. ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తున్నాం. ఇప్పటికే ఆటగాళ్ల విషయంలో జాగ్రత్తలు తీసుకున్నాం. శనివారం ఐపీఎల్ పాలక మండలి సభ్యుల సమావేశం జరగనుంది. ఐపీఎల్ 2020పై తుది నిర్ణయం తీసుకుని సమాచారం అందిస్తాం' అని ఐపీఎల్ చైర్మన్ బ్రిజేష్ పటేల్ బుధవారం పేర్కొన్నారు. ఈ నెల 29న ముంబైలో డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్‌ కింగ్స్‌ మధ్య జరిగే మ్యాచ్‌తో లీగ్‌ మొదలు కావాల్సి ఉంది.

కోర్టులో పిటిషన్‌

కోర్టులో పిటిషన్‌

ఐపీఎల్‌ 2020 సీజన్‌ను నిర్వహించడానికి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ)కి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వొద్దని కోరుతూ మద్రాసు హైకోర్టులో న్యాయవాది జి అలెక్స్‌ బెంజిగర్‌ పిటిషన్‌ వేశారు. దీనిపై జస్టిస్‌ ఎంఎం సుంద్రేశ్‌, కృష్ణన్‌ రామస్వామి డివిజన్ బెంచ్‌ గురువారం విచారణ చేపట్టే అవకాశం ఉంది.

ఆర్సీబీకీ షాకిచ్చిన కర్ణాటక ప్రభుత్వం

ఆర్సీబీకీ షాకిచ్చిన కర్ణాటక ప్రభుత్వం

లీగ్‌ను వాయిదా వేయాలని మహారాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రాజేశ్‌ తోపె బీసీసీఐకి ఇప్పటికే విజ్ఞప్తి చేశారు. తాజాగా కర్ణాటక ప్రభుత్వం తాము ఎట్టి పరిస్థితుల్లో ఈ క్యాష్ రిచ్ లీగ్‌ను నిర్వహించమని ప్రకటించింది. అంతేకాకుండా ఐపీఎల్ 2020 సీజన్‌ను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ కూడా రాసినట్లు తెలుస్తోంది.

షెడ్యూల్‌ ప్రకారమే లీగ్ అంటున్న దాదా:

షెడ్యూల్‌ ప్రకారమే లీగ్ అంటున్న దాదా:

కరోనా వైరస్‌ కారణంగా ఐపీఎల్‌ను వాయిదా వేసే అవకాశముందన్న రాజేశ్‌ తోపే వ్యాఖ్యలకు బీసీసీఐ బాస్‌ సౌరవ్‌ గంగూలీ ధీటుగా స్పందించాడు. కరోనా వైరస్‌ ఉన్నా..షెడ్యూల్‌ ప్రకారమే జరుగుతుందంటూ సోమవారం మీడియాతో చెప్పాడు. లీగ్‌కు ముందుకు సాగుతున్న సమయంలో వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు కావాల్సిన అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటామని దాదా పేర్కొన్నాడు.

Story first published: Thursday, March 12, 2020, 12:52 [IST]
Other articles published on Mar 12, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+