For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అహ్మదాబాద్ ఫ్రాంఛైజీ బెట్టింగ్ బాగోతం: ఉంటుందా? ఊడుతుందా?: ఐపీఎల్ గవర్నింగ్ తుది నిర్ణయం

IPL Governing Council to meet on Friday, fate of Ahmedabad franchise CVC capitals could be decided

ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్‌లో కొత్తగా ఎంట్రీ ఇచ్చిన సీవీసీ కేపిటల్స్ భవితవ్యం ఏమిటనేది తేలిపోనుంది. అహ్మదాబాద్ ఫ్రాంఛైజీని నెలకొల్పిన ఈ సంస్థపై బెట్టింగ్ ఆరోపణలు ఉన్నాయి. బెట్టింగులను నిర్వహించడం ద్వారా అక్రమంగా, చట్టవిరుద్ధంగా వేల కోట్ల రూపాయలను ఆర్జించిందని, ఆ మొత్తాన్ని ఐపీఎల్‌లో పెట్టుబడిగా పెట్టిందనే విమర్శలు ఉన్నాయి. అహ్మదాబాద్ ఫ్రాంఛైజీ కోసం పోటీ పడిన దేశీయ పారిశ్రామిక దిగ్గజం, అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీల అధినేత గౌతమ్ అదాని స్వయంగా ఈ ఆరోపణలు చేయడంతో కథ రసవత్తరంగా మారింది.

పోటీ పడలేకపోయిన అదాని..

పోటీ పడలేకపోయిన అదాని..

కొత్త ఐపీఎల్ ఫ్రాంఛైజీని సాధించలేక చతికిల పడిన దేశీయ పారిశ్రామిక దిగ్గజ కంపెనీ అదాని గ్రూప్- దాన్ని దక్కించుకున్న సీవీసీ కేపిటల్‌ను లక్ష్యంగా చేసుకున్న విషయం తెలిసిందే. ఐపీఎల్ ఫ్రాంఛైజీని దక్కించుకోవడానికి సీవీసీ కేపిటల్ ధారపోసిన వేల కోట్ల రూపాయల ఆదాయం ఎక్కడి నుంచి వచ్చిందనే విషయంపై ఆరా తీసింది. ఆ సంస్థ యాజమాన్యానికి అక్రమ లావాదేవీలు ఉన్నాయని అదాని గ్రూప్ ఆరోపించింది. అక్రమంగా సాధించిన సొమ్మును ఇలా ఐపీఎల్ ఫ్రాంఛైజీని సాధించడానికి ఖర్చు చేసిందని విమర్శించింది.

160 శాతం ఎక్కువగా..

160 శాతం ఎక్కువగా..

అహ్మదాబాద్‌కు చెందిన సీవీసీ కేపిటల్.. ఈ ఫ్రాంఛైజీ కోసం భారీ మొత్తంలో ఖర్చు చేసింది. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు నిర్దేశించిన బేస్ ప్రైజ్‌ కంటే 160 శాతం అధికంగా బిడ్డింగులను దాఖలు చేసింది. దీని విలువ 5,625 కోట్ల రూపాయలు. ఇది కాస్తా పోటీ కంపెనీ అదాని గ్రూప్‌కు మింగుడు పడట్లేదు. తాను దాఖలు చేసిన బిడ్డింగ్ కంటే అధికంగా బేస్ ప్రైజ్‌ను చెల్లించి మరీ ఫ్రాంఛైజీని దక్కించుకోవడాన్ని జీర్ణించుకోలేకపోతోంది.

అదాని కంటే అధికంగా కోట్..

అదాని కంటే అధికంగా కోట్..

ఫ్రాంఛైజీని తీసుకోవడానికి బీసీసీఐ నిర్ధారించిన బేస్ ప్రైజ్ 2,000 కోట్ల రూపాయలు. సీవీసీ గ్రూప్ అత్యధికంగా 5,625 కోట్ల రూపాయల మేర ఫైనాన్సియల్ బిడ్డింగ్‌ను దాఖలు చేసింది. అదాని వేసిన బిడ్డింగ్ ప్రైజ్ విలువ 5,100 కోట్ల రూపాయలు. అదాని కంటే అధికంగా బిడ్‌ను కోట్ చేసినందున.. సీవీసీ కేపిటల్‌కు ఫ్రాంఛైజీ దక్కింది. తనకంటే అధికంగా 525 కోట్ల రూపాయలను చెల్లించడాన్ని అదాని గ్రూప్‌కు తగిలిన బిగ్ షాక్‌గా చెప్పుకొంటున్నారు విశ్లేషకులు.

సీవీసీపై రివెంజ్..

సీవీసీపై రివెంజ్..

దీనితో- సీవీసీ కేపిటల్‌‌పై రివెంజ్ తీర్చుకోవడానికి అదాని గ్రూప్ పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. బెట్టింగుల్లో ఆరితేరిన కంపెనీగా అభివర్ణిస్తోంది. బెట్టింగులు, దాని అనుబంధ కార్యకలాపాలు, ఆర్థిక లావాదేవీలు సీవీసీ కేపిటల్‌కు ఉన్నాయని ఫిర్యాదు చేయడానికి సన్నద్ధమౌతున్నట్లు చెబుతున్నారు. దేశంలో బెట్టింగులు నిషేధం. అయినప్పటికీ- అక్రమంగా వాటిని నిర్వహించి వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జించిందని, దాన్నంతటినీ ఐపీఎల్ ఫ్రాంఛైజీ కోసం ధారపోసిందని అదాని ఆరోపించింది.

ఇండిపెండెంట్ కమిటీతో దర్యాప్తునకు ఛాన్స్..

ఇండిపెండెంట్ కమిటీతో దర్యాప్తునకు ఛాన్స్..

ఈ ఫిర్యాదులను ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ పరిగణనలోకి తీసుకుంది. దీనిపై చర్చించడానికి శుక్రవారం సమావేశం కానుంది. బీసీసీఐ కార్యదర్శి జయ్ షా, అరుణ్ ధుమాల్, బ్రిజేష్ పటేల్, ప్రజ్ఞాన్ ఓఝా, తదితరులు ఇందులో పాల్గొననున్నారు. ఈ ఆరోపణలపై ఇండిపెండెంట్ కమిటీతో విచారణ జరిపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనితోపాటు ఐపీఎల్ మీడియా హక్కులు, ఇతర అంశాలపై ఇందులో చర్చిస్తారు.

Story first published: Thursday, December 2, 2021, 18:02 [IST]
Other articles published on Dec 2, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+