Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్‌ 5లో కొత్త అవతారం ఎత్తనున్న దాదా...?

Sourav Ganguly
ముంబై: ఐపీఎల్‌ 5లో సౌరభ్‌ గంగూలీ కీలక పాత్ర పోషించనున్నాడు. ఐపీఎల్‌ 4 సీజన్‌ చివర్లో పుణె వారియర్స్‌ తరఫున బరిలోకి దిగిన దాదా... ఈ సారి ఆ జట్టు మార్గదర్శకుడు, సారథిగా కొత్త అవతారమెత్తనున్నాడు. జట్టు యాజమానులు 'సహారా ఇండియా పరివార్‌' ఈ కథనాన్ని ధృవీకరించకపోయినప్పటికీ గంగూలీ భుజస్కంధాలపై బృహత్తర బాధ్యతను ఉంచబోతున్నట్లు అంగీకరించారు. ''ఇప్పటివరకు ఏదీ ఖరారు కాలేదు. కానీ ఐపీఎల్‌ 5లో గంగూలీ కీలక పాత్ర పోషిస్తాడు'' అని పుణె వారియర్స్‌ అభిజిత్‌ సర్కార్‌ చెప్పాడు. ''గంగూలీ కొత్త అవతారం ఎత్తినా యువరాజ్‌ ప్రాధాన్యం తగ్గదు. గత సీజన్లో యువీనే నాయకుడు. నేటికీ అతను జట్టులో ప్రధాన ఆటగాడే'' అని పుణె వర్గాలు తెలిపాయి. గంగూలీ సెప్టెంబరులో ఇంగ్లాండ్‌ నుంచి వచ్చిన తర్వాత అతని కొత్త పాత్రపై చర్చిస్తారని చెప్పారు.
Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+