
గురువారం రాత్రి జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్ తో చివరి బంతి వరకు ఉత్కంఠంగా జరిగిన మ్యాచ్‌లో డిపెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్‌కింగ్స్ అద్భుత విజయాన్ని అందుకుంది. దీంతో చెన్నై జట్టు విజయాల హ్యాట్రిక్ కొట్టింది. చెన్నై ఇప్పటికే ఆడిన ఏడింటిలో ఆరు మ్యాచ్‌లలో విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్ర స్థానంలో కొనసాగుతోంది.
టాస్ ఓడి మొదటగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన చెన్నై.. ఆదిలోనే 3 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో అంబటి రాయుడు, ఎంఎస్ ధోనీ అద్భుత అర్ధ సెంచరీలతో చెన్నైని విజయం దిశగా తీసుకెళ్లారు. ఈ ఇద్దరు అవుట్ అయినా.. చివరి బంతికి మిచెల్ శాంట్నర్ సిక్స్ బాది చెన్నైకి చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. అయితే చివరి ఓవర్లో విజయం దోబూచులాటలో కొన్ని సరదా సంఘటనలు జరిగాయి.
అన్నింటిలోకెల్ల చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఆవేశంగా మైదానంలోకి వెళ్లి అంపైర్లతో వాదనకు దిగాడు. ఇప్పుడు ఈ విషయం పెద్ద దుమారాన్నే రేపింది. ఈ విషయాన్నీ సీరియస్ గా తీసుకున్న ఐపీఎల్ యాజమాన్యం ధోనీపై చర్యలు కూడా తీసుకుంది. ప్రస్తుతం ధోనీ ఆవేశంగా మైదానంలోకి వెళ్లడం.. స్టోక్స్, జడేజా ఆదుపుతప్పి నేలపై పడిపోవడం.. ధోనీ వికెట్ పడ్డ అనంతరం స్టోక్స్ ఆనంద క్షణాలు.. నో బాల్ విషయంలో అంపైర్లు అయోమయం పడడం.. ధోనీ తన గ్లౌవ్ చూసుకుంటున్న విషయాలు హాట్ టాపిక్ అయ్యాయి. వీటిపై సరదా మీమ్స్ నెట్టింట్లో సందడి చేస్తున్నాయి. మీకోసం కొన్ని...