విదేశాల్లో ఐపీఎల్ ‘ప్లే ఆఫ్ సీజన్’ మ్యాచ్‌లు..!!

Good Morning India : 3 Minutes 10 Headlines | IPL Play Off Matches, Namaste Trump | Oneindia Telugu

ముంబై : ఐపీఎల్ లేని సమయంలో ఇతర దేశాల్లో మ్యాచ్‌లు నిర్వహించుకోవడానికి అనుమతి ఇవ్వాలని మూడు ఫ్రాంచైజీలు బీసీసీఐని కోరినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా.. క్రికెట్‌‌కు పెద్దగా ఆదరణలేని అమెరికా, కెనడా, సింగపూర్‌లో ఈ ప్లే ఆఫ్ సీజన్ మ్యాచ్‌ల్ని నిర్వహించడం ద్వారా.. టోర్నీ ఆదరణ మరింత పెరగనుందని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీలు బీసీసీఐకి సూచించినట్లు ప్రచారం జరుగుతోంది.

ఇటీవల బీసీసీఐ ఉన్నాతాధికారుల్ని కలిసిన ఈ మూడు ఫ్రాంఛైజీలు ఐపీఎల్ లేని సమయంలో కొన్ని మ్యాచ్‌ల్నిభారత్ వెలుపల నిర్వహించాలని కోరినట్లు సమాచారం. అయితే బీసీసీఐ మాత్రం ఈ విషయంపై ఎలాంటి అధికారిక నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం.. 'ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీలు విదేశాల్లో ప్లే ఆఫ్ సీజన్ (ఐపీఎల్ లేని సమయంలో) మ్యాచ్‌లు నిర్వహించడానికి ఆసక్తికనబరుస్తున్నాయి. అయితే ఇటీవల జరిగిన గవర్నింగ్ కౌన్సిల్లో ఈ అంశంపై చర్చించడానికి కూడా బీసీసీఐ నిరాకరించింది.'అని తెలిపింది.

ఫన్ లేదంటే ఏదో తేడా కొడుతున్నట్టే : మంధాన

ఇక క్రికెట్‌కు పెద్దగా ఆదరణ లేని అమెరికా, కెనడా, సింగపూర్‌లో మ్యాచ్‌లు నిర్వహించడం ద్వార టోర్నీ ఆదరణ మరింత పెరుగనుందని ఓ ఫ్రాంచైజీ యజమాని బీసీసీఐ ముందు ప్రస్తావించినట్లు కూడా పేర్కొంది. 'ఈ ఆఫ్ సీజన్ మ్యాచ్‌లతో ఇతర దేశాల్లో కూడా ఐపీఎల్‌పై ఆదరణ పెరుగుతుంది. ముఖ్యంగా క్రికెట్‌పై ఆసక్తికనబర్చని దేశాలు కెనడా, అమెరికా, సింగపూర్‌లో ఈ మెగా టోర్నీకి ప్రాచూర్యం లభిస్తుంది.'అని సదరు యజమాని బీసీసీఐని కోరినట్లు తెలుస్తోంది.

ఇక మార్చి 29 నుంచి ఐపీఎల్ 2020 సీజన్ మ్యాచ్‌లు ప్రారంభంకానుండగా.. మే 17 వరకూ లీగ్ దశ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ మేరకు ఇప్పటికే లీగ్ దశ షెడ్యూల్‌ని విడుదల చేసిన బీసీసీఐ.. నాకౌట్ మ్యాచ్‌ల తేదీలు, వేదికల వివరాలు మాత్రం వెల్లడించలేదు. అయితే.. మే 24న ఫైనల్ జరగనున్నట్లు మాత్రం ప్రకటించింది. ఇప్పటికే ఫ్రాంచైజీలన్నీ ఈ క్యాష్ రిచ్ లీగ్‌కు తమ సన్నాహకాలను మొదలుపెట్టాయి.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
 
Story first published: Wednesday, February 19, 2020, 19:08 [IST]
Other articles published on Feb 19, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X