Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

యూఏఈలో ఐపీఎల్‌ 2020.. చార్టర్డ్ విమానాలను అద్దెకు తీసుకుంటున్న ఫ్రాంచైజీలు!!

IPL franchises planning to hire chartered planes to ferry players

ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 సీజన్‌ సెప్టెంబరులో ప్రారంభమయ్యే సూచనలు ఉన్నాయి. శుక్రవారం సమావేశమైన భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) లీగ్‌ వేదికపై ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. సమావేశంలో ఐపీఎల్-13 సీజన్ నిర్వహణ గురించి దాదాపు నాలుగు గంటలు చర్చించి.. యూఏఈ వేదికగా సెప్టెంబరు 26 నుంచి టోర్నీని ప్రారంభించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఐపీఎల్‌ గురించి ఎలాంటి అధికారిక ప్రకటన రాకముందే.. ప్రాంచైజీలు మాత్రం యూఏఈలో లీగ్ ఆడటానికి సన్నాహాలు ప్రారంభించారట.

హోటళ్ల గురించి తెలుసుకుంటున్నాం:

హోటళ్ల గురించి తెలుసుకుంటున్నాం:

ఐపీఎల్ ఫ్రాంఛైజ్ అధికారి ఒకరు మాట్లాడుతూ... ఇప్పటికే లాజిస్టిక్స్ కోసం సన్నాహాలు ప్రారంభించినట్లు తెలిపారు. ఇక అబుదాబి వెళ్ళడానికి మార్గాలు, అక్కడ బస చేసేందుకు అనువైన హోటళ్ల గురించి తెలుసుకుంటున్నట్లు పేర్కొన్నారు. 'ఏదైనా ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. అప్పటికప్పుడు అంటే చాలా కష్టం. మేము అబుదాబిలో ఉండాలనుకుంటున్న హోటళ్లపై నిర్ణయం తీసుకున్నాం. యూఏఈలో అప్పటి ఆరోగ్య మార్గదర్శకాలతో మేము స్పష్టంగా ముందుకు సాగాలి. అని ఫ్రాంచైజీ అధికారి పేర్కొన్నారు.

భారత్‌లో ఐసోలేషన్ పూర్తి చేయాలి:

భారత్‌లో ఐసోలేషన్ పూర్తి చేయాలి:

మాజీ ఛాంపియన్ ఫ్రాంచైజీకి చెందిన అధికారి ఒకరు మాట్లాడుతూ... 'యూఏఈకి వెళ్లే ముందు భారత్‌లో ఐసోలేషన్ పూర్తి చేయాలని వారు చూస్తున్నారు. భారతదేశంలో బయో సెక్యూర్ వాతావరణంలో గడిపిన సమయాన్ని పరిశీలించి.. ఆ తరువాత కరోనా పరీక్షలు చేసిన తరువాత యూఏఈకి వెళ్లాలని సూచించారు. మనలో ఒకరికి లక్షణాలు ఉన్నా.. అది ఇతరులకు సోకే ప్రమాదం ఉంది. అందువల్ల బయలుదేరే ముందు దేశంలో కొన్ని వారాల పాటు ఐసోలేషన్‌లో ఉండి పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం' అని తెలిపారు.

చార్టర్డ్ విమానానే బెస్ట్ చాయిస్:

చార్టర్డ్ విమానానే బెస్ట్ చాయిస్:

ట్రావెల్ ప్లాన్ గురించి మరో ఫ్రాంచైజ్ అధికారి మాట్లాడుతూ... 'చాలా జట్లు కాకపోయినా కొన్ని జట్లు ఇప్పటికే చార్టర్డ్ విమానాలను అద్దెకు తీసుకుంటున్నట్లు నేను అనుకుంటున్నా. ఆగస్టు చివరి నాటికి రెగ్యులర్ విమానాలు నడుస్తాయో లేదో ఎలాంటి స్పష్టత లేదు. చాలా జట్లు ఆగస్టు చివరి వారంలో లేదా సెప్టెంబర్ మొదటి వారంలో యూఏఈలో ఉండాలనుకుంటున్నాయి. అలాంటప్పుడు చార్టర్డ్ విమానాలను అద్దెకు తీసుకోవడమే మంచిది. మొత్తం 35 నుంచి 40 మంది వరకు యూఏఈకి వెళ్లాల్సి వస్తుంది కాబట్టి చార్టర్డ్ విమానానే బెస్ట్ చాయిస్' అని సూచించారు.

ఫస్ట్ క్లాస్ ప్రయాణాన్ని చూస్తున్నాం:

ఫస్ట్ క్లాస్ ప్రయాణాన్ని చూస్తున్నాం:

'నిజం చెప్పాలంటే ఫ్రాంచైజీగా మేము మా ఆటగాళ్ల కోసం ఫస్ట్ క్లాస్ ప్రయాణాన్ని చూస్తున్నాం. భారతదేశంలో మేము ఇప్పటికే సమావేశం అయి ఉండకపోవచ్చు. అవసరమైన కరోనా వైరస్ సంబంధిత పరీక్షలు చేసిన తరువాత ప్రతి ఒక్కరం ఇంటి నుంచి నేరుగా యూఏఈకి వెళ్తాం. కాబట్టి ఫ్రాంచైజీ యజమానులు 8-10 చార్టర్డ్ ట్రిప్పులకు నగదు చెల్లించాల్సి ఉంటుంది. సాధారణ విమానాల్లో ప్రయాణం ప్రారంభం కాకపోతే ఇదే సరైన ఎంపిక' అని మరో ఫ్రాంచైజీ అధికారి చెప్పారు.

త్వరలోనే అధికారిక ప్రకటన:

త్వరలోనే అధికారిక ప్రకటన:

షెడ్యూల్ ప్రకారం మార్చి 29 నుంచి ప్రారంభంకావాల్సిన ఐపీఎల్ 2020 కరోనా వైరస్ కారణంగా తొలుత ఏప్రిల్ 15కి వాయిదాపడగా.. అప్పటికి దేశంలో పరిస్థితులు అదుపులోకి రాకపోవడంతో టోర్నీని బీసీసీఐ నిరవధికంగా వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా వేదికగా అక్టోబరు 18 నుంచి నవంబరు 15 వరకూ టీ20 ప్రపంచకప్‌ జరగాల్సి ఉండగా.. వైరస్ కారణంగా ఆ టోర్నీకి తాము ఆతిథ్యమివ్వలేమని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) స్పష్టం చేసింది. దాంతో టీ20 ప్రపంచకప్‌‌ని వాయిదా వేయాలని భావిస్తున్న ఐసీసీ.. త్వరలోనే అధికారిక ప్రకటనని విడుదల చేయనుంది.

Story first published: Saturday, July 18, 2020, 18:50 [IST]
Other articles published on Jul 18, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+