వేలంలో కొనుగోలు చేసిన తర్వాత అందుబాటులో ఉండని విదేశీ ప్లేయర్లను నిషేధించాలని సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈవో కావ్య మారన్ బీసీసీఐ-ఐపీఎల్ మీటింగ్‌లో డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. గాయంతో దూరమైతే ఫర్వాలేదు కానీ, ఇతరత్రా కారణాలతో సీజన్‌కు అందుబాటులో లేకపోతే సీరియస్ యాక్షన్ తీసుకునేలా నిబంధనలు చేయాలని సూచించింది.
శ్రీలంక ఆల్‌రౌండర్ హసరంగ కారణంగానే కావ్య ఈ వ్యాఖ్యలు చేసిందని తెలుస్తోంది. గత వేలంలో హసరంగను సన్‌రైజర్స్ రూ.1.5 కోట్లకు దక్కించుకుంది. కానీ గాయం కారణంతో హసరంగ ఐపీఎల్-2024 నుంచి తప్పుకున్నాడు. అయితే 2023 వరకు ఆర్సీబీతో హసరంగకు రూ.10 కోట్లు కాంట్రాక్ట్ ఉండేది. కానీ ఆర్సీబీ వదులుకోవడంతో వేలంలోకి వచ్చిన హసరంగ తక్కువ ధర పలికాడు. దీంతోనే అతను గాయం కారణం చెప్పి సీజన్‌కు దూరమయ్యాడని వాదన ఉంది.

హసరంగ మాత్రమే కాకుండా కొందరు విదేశీ ప్లేయర్లు ఐపీఎల్‌లో తెలివిగా వ్యవహరిస్తున్నారు. మెగా వేలానికి కాకుండా, మినీ వేలానికి మాత్రమే అందుబాటులోకి వస్తున్నారు. మినీ ఆక్షన్‌లో భారీ ధర సొంతం చేసుకుంటున్నారు. 2018-24 మధ్యలో రెండు సార్లు మెగా వేలం జరిగింది. ఈ మెగా ఆక్షన్‌లో అత్యధిక ధర రూ. 15.25 కోట్లు. 2022లో ఈ భారీ మొత్తాన్ని ముంబై ఇండియన్స్ ఇషాన్ కిషన్‌పై వెచ్చించింది.
కానీ 2024 సీజన్ కోసం నిర్వహించిన మినీ వేలంలో మిచెల్ స్టార్క్ రూ.24.75 కోట్లు, ప్యాట్ కమిన్స్ రూ.20.50 కోట్ల భారీ ధర పలికారు. ఈ ఆస్ట్రేలియా స్టార్ ఆటగాళ్లు వ్యూహాత్మకంగా మినీ వేలంలోనే పేర్లను నమోదు చేసుకుంటారనే అభిప్రాయాలు ఉన్నాయి. ఇక కనీస ధరకే అమ్ముడు పోయిన కొందరు విదేశీ ప్లేయర్లు లీగ్ నుంచి తప్పుకున్న సందర్భాలు ఉన్నాయి. సదరు ప్లేయర్ వ్యక్తిగత మేనేజర్.. ఎక్కువ ధర ఇస్తే ఫ్రాంచైజీలకు అందుబాటులోకి వస్తామని తెలిపిన ఉదంతాలు ఉన్నాయని సమావేశంలో కొన్ని ఫ్రాంచైజీలు పేర్కొన్నాయి.
ఓ విదేశీ ప్లేయర్ వైదొలగడం వల్ల జట్టుపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. దీంతో విదేశీ ప్లేయర్లపై నిబంధనలు విధించాలని కావ్య మారన్‌తో సహా అన్ని ఫ్రాంచైజీలు సమావేశంలో ఏకాభిప్రాయానికి వచ్చాయి. ఫారెన్ ప్లేయర్లపై రెండు రూల్స్‌ను ఈ మెగా వేలం నుంచి అమలు చేయాలని బీసీసీఐకి డిమాండ్ చేశాయి.
చట్టబద్ధమైన కారణం లేకుండా ఓ విదేశీ ప్లేయర్ సీజన్‌కు దూరమైతే.. అతనిపై రెండేళ్ల పాటు నిషేధం విధించాలి. చట్ట బద్ధమైన కారణాలలో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లు, గాయం, ఫ్యామిలీ కమిట్‌మెంట్స్ ఉన్నాయి. ఇక మెగా వేలంలో పేర్లను తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి. ఈ మెగా ఆక్షన్‌లో అన్‌సోల్డ్‌గా మిగిలిపోతే మినీ వేలంలో పాల్గొనడానికి అర్హులుగా ఉంటారు. ఈ రెండు నిబంధనలు అమలు కానున్నాయి.