మాజీ మిస్ యూనివర్స్ సుస్మితాసేన్ తన అర్ధాంగి అని ప్రకటించిన ఐపీఎల్ ఫౌండర్ లలిత్ మోడీ, ఫోటోలతో రచ్చ

ఇండియన్ ప్రీమియర్ లీగ్ అంటే క్రికెట్ చరిత్ర గతిని మార్చేసిన మెగా ఈవెంట్. 2008లో ఆరంభమైన ఐపీఎల్ సీజన్.. అప్రతిహతంగా సాగుతోంది. ఎందరో మాణిక్యాల్లాంటి క్రికెటర్లను వెలికి తీసిన టోర్నమెంట్ ఇది. ఐపీఎల్ వల్ల బీసీసీఐ ప్రపంచ క్రికెట్‌ను శాసించే స్థాయికి ఎదగగలిగింది. క్రికెటర్ల మీద కనక వర్షాన్ని కురిపించే టోర్నీగా ఐపీఎల్ నిలిచిపోయింది. ఇంతటి ప్రాధాన్యత ఉన్న ఐపీఎల్ రూపకర్త ప్రముఖ వ్యాపారవేత్త, క్రికెట్ అడ్మినిస్ట్రేటర్ అయిన లలిత్ మోడీ. అతని మైండ్‌లో ఉద్భవించిన ఈ టోర్నీ.. ప్రస్తుతం క్రికెట్లో తిరుగులేని టోర్నీగా కొనసాగుతుంది. ఇక ఐపీఎల్ వ్యవస్థాపకుడు అయిన లలిత్ మోడీ సీజన్‌కు మొట్టమొదటి ఛైర్మన్, కమిషనర్‌గా వ్యవహరించారు.
రెండు సంవత్సరాల పాటు లలిత్ మోడీ హవా చూపించాడు. ఇక ఐపీఎల్ చీఫ్‌గా ఉన్న సమయంలో లలిత్ మోడీ ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డాడని ఈడీ కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. తరువాత లలిత్ మోడీ ఐపీఎల్ చీఫ్ పదవి నుండి ఉద్వాసనకు గురి అయ్యాడు. అదే సమయంలో కేసులు నమోదు కావడంతో లలిత్ మోడీ 2010లో లండన్ పారిపోయాడు. అక్కడ జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. అతనితో రాజీ కుదుర్చుకున్న పలువురు పొలిటికల్ నాయకుల అండా ఉండడంతో అతను స్వేచ్ఛగా జీవించగలుగుతున్నాడనే అభియోగాలున్నాయి. ఇకపోతే లలిత్ మోడీ.. సోషల్ మీడియాలో ఓ అదిరిపోయే న్యూస్ వెలువరించాడు.
ఫోటోలను పోస్ట్ చేస్తూ కన్ఫామ్ చేసిన మోడీ
బాలీవుడ్ నటి.. మాజీ మిస్ యూనివర్స్ అయిన సుస్మితాసేన్‌తో తాను డేటింగ్లో ఉన్నట్లు సంచలన ప్రకటన చేశాడు. అంతేకాకుండా సుస్మితాతో దిగిన ఫోటోలను కూడా పోస్టు చేశాడు. దీంతో క్రికెట్ వర్గాల్లో ఈ విషయం చర్చనీయాంశమైంది. అసలు ఇంతకీ లలిత్ మోదీ ఏమని ట్వీట్ చేశాడంటే.. 'ఇటీవలే కుటుంబంతో కలిసి చేసిన గ్లోబల్ టూర్ ముగిసింది. మేం మాల్దీవులు, సార్డినియా తదితర ప్రాంతాలకు టూర్‌కు వెళ్లొచ్చాక తర్వాత లండన్‌కు తిరిగి వచ్చాను. నా బెటర్‌హాఫ్ (అర్ధాంగి) సుస్మితా సేన్ గురించి చెప్పనక్కర్లేదు. ఎట్టకేలకు కొత్త జీవితాన్ని ప్రారంభించాను. చంద్రుడిపై ఉన్నట్లు ఉంది' అని లలిత్ మోడీ క్యాప్షన్ ఇచ్చాడు.
ఇంకా పెళ్లి చేసుకోలేదు కానీ..
ఇకపోతే సుస్మితా సేన్, లలిత్ మోడీ ఎప్పుడూ పెళ్లి చేసుకున్నారంటూ నెట్టింట క్వశ్చన్లు పోటెత్తాయి. ఇక ఈ విషయమై కూడా లలిత్ మోడీ క్లారిటీ ఇచ్చాడు. తాము ఇద్దరం ఇంకా పెళ్లి చేసుకోలేదని, కేవలం 'డేటింగ్' మాత్రమే చేస్తున్నామని లలిత్ మోడీ స్పష్టం చేశాడు. 'జస్ట్ క్లారిటీ ఇవ్వడానికి ఈ ట్వీట్ చేస్తున్నా. మేం పెళ్లి చేసుకోలేదు. ఇద్దరం డేటింగ్‌లో ఉన్నాం. ఏదో ఒక రోజు పెళ్లి ముచ్చట కూడా తీరుతుంది' అని లలిత్ మోడీ మరో ట్వీట్ చేశాడు.

మిస్ యూనివర్స్ కిరీటం పొందిన తొలి భారతీయ మహిళ
ఇకపోతే సుస్మితా సేన్ ఇటీవల మాల్దీవులలో తాను విహారయాత్రకు వెళ్లినట్లు సోషల్ మీడియాలో పలు ఫోటోలను పంచుకుంది. ఆమె తన కుమార్తెలతో కలిసి మాల్దీవులను సందర్శించింది. ఇదే టైంలో సుస్మితాసేన్‌తో పాటు లలిత్ మోడీ కూడా ఈ టూర్‌కు వెళ్లినట్లు స్పష్టమైంది. ఇకపోతే 46ఏళ్ల సుస్మితా సేన్ 1994లో మిస్ యూనివర్స్‌గా నిలిచింది. ఆమె ఇండియా నుంచి మిస్ యూనివర్స్‌గా ఎంపికైన తొలి మహిళగా పేరొందింది. అలాగే ఫెమినా మిస్ ఇండియా తదితర అవార్డులను కూడా ఆమె పొందింది. ఇకపోతే సుస్మితా సేన్ గతంలో విక్రమ్ బట్, రనదీప్ హుడా, వసీం అక్రమ్ తదితరులతో అఫైర్లు నడిపినట్లు వార్తలున్నాయి. ఆమె రోమాన్ షాల్‌తో కొన్నాళ్లు రిలేషన్ షిప్లో ఉంది. 2021 డిసెంబర్‌లో వీరిద్దరు విడిపోయారు. ఇక ఆమె పెళ్లి చేసుకోలేదు కానీ ఆమెకు రీని సేన్, అలీసా సేన్ అనే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications