For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బౌలర్‌, బ్యాట్స్‌మన్‌ పడిపోయారు.. బంతి మాత్రం సిక్సర్‌ వెళ్ళింది

IPL 2019 : Ravindra Jadeja Craziest Flying Six, Earns Bizarre Appreciation From MS Dhoni || Oneindia
IPL: Flying Ravindra Jadeja Hits Craziest Six in RR Vs CSK

బంతిని వేసిన బౌలర్, బంతిని కొట్టిన బ్యాట్స్‌మన్‌ ఇద్దరూ కింద పడిపోయారు.. బంతి మాత్రం సిక్సర్‌ వెళ్ళింది. ఈ ఫన్నీ ఘటన గురువారం రాత్రి జైపూర్‌ వేదికగా చెన్నై సూపర్‌ కింగ్స్‌, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో చోటుచేసుకుంది. ఈ మ్యాచ్‌లో విజయం చివరి బంతి వరకూ దోబూచులాడినా.. చెన్నై సూపర్‌ కింగ్స్‌నే వరించింది. ఈ మ్యాచ్‌లో పలు ఆసక్తికర సంఘటనలు జరిగాయి. అయితే సర్‌ రవీంద్ర జడేజా కొట్టిన సిక్స్ మాత్రం హైలెట్ గా నిలిచింది.

జడేజా అదుపుతప్పాడు:

ఇన్నింగ్స్ చివరి ఓవర్లో చెన్నై విజయానికి 18 పరుగులు అవసరం అయ్యాయి. క్రీజులో ఎంఎస్ ధోనీ, రవీంద్ర జడేజాలు ఉన్నారు. స్ట్రైకింగ్ లో జడేజా ఉండగా.. చివరి ఓవర్ వేసేందుకు రాజస్థాన్ బౌలర్ బెన్ స్టోక్స్‌ సిద్ధంగా ఉన్నాడు. స్టోక్స్‌ తొలి బంతిని ఆఫ్‌స్టంప్‌ ఆవల వేయగా.. జడేజా బలంగా బాదాడు. అయితే బంతిని బాదే క్రమంలో జడేజా అదుపుతప్పి కిందపడిపోయాడు. సీన్ కట్ చేస్తే.. బంతి వెళ్లి స్టాండ్స్ లో పడిపోయింది.

ఇద్దరూ పడినా బంతి మాత్రం సిక్సర్‌ వెళ్ళింది:

ఇద్దరూ పడినా బంతి మాత్రం సిక్సర్‌ వెళ్ళింది:

కిందపడిన జడేజా బంతి స్టాండ్స్ లోకి వెళ్లినా కూడా అలాగే చూస్తూ ఉన్నాడు. అవతలి ఎండ్ లో ఉన్న మహీ వచ్చి జడేజా తలపై బ్యాట్ తో కొట్టాడు. అప్పుడు సర్ జడేజా నవ్వుతూ లేచాడు. మరోవైపు బంతిని వేసిన స్టోక్స్‌ కూడా అదుపుతప్పి కిందపదిపోయి.. బంతి ఎటువెళ్తుందా అని చూడసాగాడు. బంతి స్టాండ్స్ లోకి వెళ్లగా నిరాశగా జడేజా వైపు చూస్తూ వెళ్ళిపోయాడు. ప్రస్తుతం దీనికి సంబందించిన వీడియో నెట్టింట్లో వైరల్ అయింది. ఇక ఆలస్యం ఎందుకు మీరూ ఓ లుక్కేయండి.

ఆఖరి ఓవర్లో ఉత్కంఠ:

ఆఖరి ఓవర్లో ఉత్కంఠ:

చెన్నై ఆఖరి ఓవర్లో 18 పరుగులు చేయాల్సి రాగా.. తొలి బంతిని జడేజా సిక్సర్‌గా మలిచాడు. రెండో బంతి నోబాల్‌ వేయగా.. జడేజా ఓ పరుగు చేశాడు. ఫ్రీ హిట్ బంతికి ధోనీ 2 పరుగులు చేశాడు, కానీ మూడో బంతికి క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. శాంట్నర్‌ నాలుగు బంతికి రెండు, ఐదో బంతికి రెండు పరుగులు చేశాడు. ఇక చివరి బంతికి నాలుగు పరుగులు అవసరం కాగా.. స్టోక్స్‌ వైడ్‌ వేశాడు. అదనంగా వచ్చిన బంతిని శాంట్నర్‌ సిక్స్‌ కొట్టేసి చెన్నైకి సంచలన విజయం అందించాడు.

Story first published: Friday, April 12, 2019, 12:26 [IST]
Other articles published on Apr 12, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+