ఇండోర్: ఐపీఎల్‌లో భాగంగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్-రైజింగ్ పూణె సూపర్‌జెయింట్ మధ్య జరుగుతోన్న మ్యాచ్‌లో తొలి సిక్స్ 10 ఓవర్లకి నమోదైంది. ఐపీఎల్ అంటే ఆట ప్రారంభం నుంచే సిక్సర్లు, ఫోర్లు మోత మోగుతాయి. కానీ, ప్రస్తుతం జరుగుతోన్న పుణె-పంజాబ్ మ్యాచ్‌లో 9.6వ బంతికి తొలి సిక్స్ నమోదవ్వడం గమనార్హం.
తొలి ఓవర్‌లోనే ఓపెనర్ మయాంక్ అగర్వాల్ వికెట్ కోల్పోయిన పుణె రక్షణాత్మక ధోరణిలో ఆడుతోంది. మయాంక్ తర్వాత స్వల్ప వ్యవధిలోనే రహానె, కెప్టెన్ స్మిత్ కూడా మైదానాన్ని వీడారు. దీంతో పుణె సిక్సర్లు, ఫోర్లు బాదకుండా ఆచితూచి ఆడుతున్నట్లు కనిపిస్తోంది.

ఐపీఎల్-10వ సీజన్‌లో 10వ ఓవర్లో తొలి సిక్స్ నమోదవ్వడం ఇదే తొలిసారి. స్వప్నిల్ బౌలింగ్ 9.6వ ఓవర్లో స్టోక్స్ ఈ మ్యాచ్‌లో తొలి సిక్స్ బాదాడు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుతో జరుగుతున్న ఐపిఎల్ మ్యాచ్‌లో రైజింగ్ పూణె సూపర్‌జెయింట్ జట్టు బ్యాట్స్‌మన్ బెన్ స్టోక్స్ హాఫ్ సెంచరీ చేశాడు.
30 బంతుల్లో 2 ఫోర్లు 3 సిక్సర్లతో 50 పరుగులు పూర్తి చేశాడు. టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ తక్కువ పరుగులకే ఔటైనప్పటికీ నిలకడగా ఆడాడు. స్టోక్స్‌కు జతగా మనోజ్ తివారి 40 పరుగులతో, రజత్ భాటియా ఒక్క పరుగూ చేయకుండా నాటౌట్ గా నిలిచారు. పూణె జట్టు 20 ఓవర్లు ముగిసే సమయానికి 6 వికెట్లు కోల్పోయి 163 పరుగులు సాధించింది.