Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

హైదరాబాదులో ఐపియల్ మ్యాచులు హుళక్కే

Lalit Modi
హైదరాబాద్: దక్కన్ చార్జర్స్ సొంత గడ్డ హైదరాబాదులో నిర్వహించ తలపెట్టిన మ్యాచులను ఇతర ప్రాంతాలకు మార్చాలని ఇండియన్ ప్రీమీయర్ లీగ్ (ఐపియల్) నిర్ణయించింది. తెలంగాణ ప్రాంతంలో ప్రశాంత వాతావరణం లేకపోవడంతో ఐపియల్ ఆ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 12వ తేదీన ప్రారంభ మ్యాచుతో పాటు ఐదు మ్యాచులు హైదరాబాదులో జరగాల్సి ఉండింది. అయితే వాటిని హైదరాబాదు నుంచి మార్చాలని ఐపియల్ నిర్ణయించింది.

దక్కన్ చార్జర్స్ కు, కోల్ కత్తా నైట్ రైడర్స్ కు మధ్య జరగాల్సిన మ్యాచు ముంబైలో జరుగుతుందని ఐపియల్ కమిషనర్ లలిత్ మోడీ ప్రకటించారు. మార్చి 19, 21, 29 తేదీల్లో హైదరాబాదులో జరగాల్సిన ఇతర మ్యాచులు నాగపూర్ లో జరుగుతాయని ఆయన చెప్పారు. ఏప్రిల్, 5, 10, 21 తేదీల్లో జరగాల్సిన మ్యాచులు ముంబైలో జరుగుతాయి. దీన్ని బట్టి విశాఖపట్నంలో జరగాల్సిన మ్యాచులు కూడా ముంబై తరలిపోయినట్లు అర్థమవుతోంది.
Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+