Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL Final: SRH ఓటమికి మూడు కారణాలు!

సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు హార్ట్ బ్రేక్. సీజన్ ఆద్యంతం సత్తాచాటిన ఎస్‌ఆర్‌హెచ్ ఫైనల్లో తడబడింది. కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో చిత్తుగా ఓడి కప్‌ను చేజార్చుకుంది. కనీస పోటీ ఇవ్వకుండా ప్రత్యర్థికి దాసోహమైంది. చెపాక్ వేదికగా ఆదివారం కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో హైదరాబాద్ ఎనిమిది వికెట్ల తేడాతో ఘోరపరాజయాన్ని చవిచూసింది.

ఏకపక్షంగా సాగిన ఫైనల్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ 18.3 ఓవర్లలోనే 113 పరుగులకు ఆలౌటైంది. ఐపీఎల్ ఫైనల్స్‌లో ఓ జట్టుకు ఇదే అత్యల్ప స్కోరు.కెప్టెన్ కమిన్స్ (24; 19 బంతుల్లో, 2x4, 1x6) టాప్ స్కోరర్. కోల్‌కతా బౌలర్లలో రసెల్ (3/19) మూడు, స్టార్క్ (2/14), హర్షిత్ రాణా (2/24) చెరో రెండు వికెట్లు తీశారు. అనంతరం ఛేదనలో కేకేఆర్ రెండు వికెట్లు కోల్పోయి 10.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని సాధించింది. వెంకటేశ్ అయ్యర్ (52; 26 బంతుల్లో, 4x4, 3x6) అజేయ అర్ధశతకం సాధించాడు.

IPL Final Three Reasons for Sunrisers Hyderabad s Defeat to KKR

అయితే సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓటమికి మూడు ప్రధాన కారణాలు ఉన్నాయని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఓపెనర్లపైనే జట్టు ఎక్కువగా ఆధారపడటం, మిడిలార్డర్ విఫలమవ్వడం హైదరాబాద్ ఓటమికి ప్రధాన కారణమయ్యాయి. లీగ్ దశలో విధ్వంసకర బ్యాటింగ్ చేసిన ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ కీలక పోరులో తడబడ్డారు. అభిషేక్ రెండు పరుగులు చేయగా, హెడ్ ఖాతా తెరవకముందే పెవిలియన్‌కు చేరాడు. ఫైనల్‌లో మాత్రమే కాకుండా గత రెండు మ్యాచ్‌ల్లోనూ వీరిద్దరు విఫమవవ్వడం గమనార్హం.

చివరి మూడు మ్యాచ్‌ల్లో అభిషేక్ 2, 12, 3 పరుగులు చేశాడు. ట్రావిస్ హెడ్ 0, 34, 0 పరుగులతో నిరాశపరిచాడు. సన్‌రైజర్స్ బలమే బలహీనంగా మారింది. ఇక రెండో కారణం తుది పోరులో కమిన్స్ వ్యూహాలు విఫలమవ్వడం. హెడ్ వికెట్‌ను మిచెల్ స్టార్క్ తీస్తాడనే భయంతో అభిషేక్‌తో ఇన్నింగ్స్ ప్రారంభించారు. అంతర్జాతీయ క్రికెటర్ అయిన హెడ్‌కు బదులుగా కుర్రాడికి స్ట్రైకింగ్ ఇచ్చిన ప్లాన్ అట్టర్‌ఫ్లాప్ అయ్యింది. తొలి ఓవర్‌లోనే వికెట్ కోల్పోవడంతో జట్టు ఆత్మరక్షణలో పడింది.

అలాగే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడం కూడా జట్టును దెబ్బకొట్టింది. స్ట్రాంగ్ బౌలింగ్ లైనప్ ఉన్న కేకేఆర్‌ను క్వాలిఫయిర్-1లో కూడా సన్‌రైజర్స్ బ్యాటర్లు ఎదుర్కోలేకపోయారు. కానీ క్వాలిఫయిర్-2లో రాజస్థాన్‌పై తొలుత బ్యాటింగ్ చేసి గెలిచామనే కారణంతో కమిన్స్ మొదట బ్యాటింగ్ తీసుకున్నాడు. ఈ డెసిషన్ బ్యాక్‌ఫైర్ అయ్యింది. ఇక ఆఖరి కారణం జట్టు కూర్పు. విఫలమవుతున్న అబ్దుల్ సమద్, ఎయిడెన్ మార్క్‌రమ్‌కు పదేపదే అవకాశాలు ఇచ్చారు. మార్క్‌రమ్ స్థానంలో గ్లెన్ ఫిలిప్స్‌కు, సమద్ స్థానంలో సుందర్‌కు ఛాన్స్ ఇస్తే ఫలితం మరోలా ఉండొచ్చు.

Story first published: Monday, May 27, 2024, 10:23 [IST]
Other articles published on May 27, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+