Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

గత చరిత్ర అదే చెబుతోంది..: చెన్నై ఛేజింగ్‌ గండంలో చిక్కుకుంటుందా?

Csk

హైదరాబాద్: ఐపీఎల్ టోర్నీలో భాగంగా వాంఖడె వేదికగా చెన్నై, హైదరాబాద్ జట్ల మధ్య ఐపీఎల్ పైనల్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో చెన్నైని ఓ సెంటిమెంట్ వెంటాడుతోంది. ఇప్పటి వరకు ఏడుసార్లు ఐపీఎల్ ఫైనల్‌కు చేరిన చెన్నై సూపర్ కింగ్స్ కేవలం రెండుసార్లు మాత్రమే టైటిల్ నెగ్గింది.

2010లో ముంబై ఇండియన్స్‌, 2011లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరులతో జరిగిన ఫైనల్లో గెలిచి చెన్నై వరుసగా టైటిల్ విజేతగా నిలిచింది. అయితే ఈ రెండు మ్యాచ్‌ల్లో చెన్నై టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకొని గెలుపొందింది. కోల్‌కతాతో జరిగిన 2012 ఫైనల్లో ఛేజింగ్‌కు మొగ్గు చూపిన చెన్నై ఓడిపోయింది.

అలాగే, ముంబై ఇండియన్స్‌తో 2015 సీజన్‌ ఫైనల్లో సైతం ఫీల్డింగ్‌ ఎంచుకొని మరోసారి ఓటమి పాలైంది. కానీ ఈసారి మాత్రం బ్యాటింగ్‌పై ఉన్న నమ్మకంతో కెప్టెన్ ధోనీ ఛేజింగ్‌ను ఎంచుకున్నాడు. దీంతో చెన్నై ఛేజింగ్‌ గండంలో చిక్కుకుంటుందా? లేక చరిత్రను తిరగరాస్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది.

1
43470

ఇదిలా ఉంటే గత పది సీజన్ల ఫైనల్లో తొలుత బ్యాటింగ్‌ చేసిన జట్లే ఎక్కువగా గెలుపొందడం ఇక్కడ మరో విశేషం. ఇదిలా ఉంటే ఐపీఎల్ ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసి ప్రత్యర్థి చెన్నై ఎదుట భారీ విజయ లక్ష్యాన్ని ఉంచింది. చెన్నై బౌలింగ్‌లో ఎంగిడి, ఠాకూర్, కర్న్, బ్రావో, జడేజా తలో వికెట్ తీశారు.

Story first published: Sunday, May 27, 2018, 21:34 [IST]
Other articles published on May 27, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+