Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL Finals: SRH తుది జట్టు ఇదే- ఆ భారత హిట్టర్‌పై వేటు!

ఐపీఎల్ 2024లో ఛాంపియన్‌గా నిలవడానికి సన్‌రైజర్స్ హైదరాబాద్ మరో అడుగు దూరంలో నిలిచింది. మరో ఒక్క విజయం సాధిస్తే ఎస్‌ఆర్‌హెచ్‌ విజేతగా నిలుస్తుంది. గత సీజన్‌లో ఎదురైన గుణపాఠాలను నేర్చుకుని, పొరపాట్లను పునరావృతం చేయకుండా ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ ఫైనల్‌కు దూసుకొచ్చింది. ఐపీఎల్-2024లో మన తెలుగు జట్టు పోరాటం స్టయిలే సెపరేటు.

క్రికెట్ ప్రపంచం ఒక్కసారి ఉలిక్కిపడేలా పరాక్రమం చూపించింది. టీ20 ఫార్మాట్ అంటే ఊచకోత కామన్ అని సగటు అభిమానికి అనిపించేలా చేసింది. 11 ఏళ్లుగా బూజు పట్టి ఉన్న ఆర్సీబీ అత్యధిక టీమ్ రికార్డును దుమ్ముదులిపే ప్రదర్శనతో బద్దలుకొట్టింది. ఒక్కసారి కాదు ఏకంగా కొన్నిరోజుల వ్యవధిలోనే చరిత్ర తిరగరాసింది. సన్‌రైజర్స్ గెలుపు మంత్రాన్ని ఇతర జట్లు కూడా ఫాలో అవ్వడంతో ఐపీఎల్ హోరాహోరీగా మారింది.

IPL Final SRH Playing XI vs KKR Glenn Phillips Entry Sundar Replaces Abdul Samad

అయితే ఎస్‌ఆర్‌హెచ్ ఫైనల్ తలపడే ప్రత్యర్థి అంత తేలికైనది కాదు. ఓటమిని ఆఖరి వరకు అంగీకరించదు. భీకర హిట్టర్లు, క్వాలిటీ బౌలర్లు కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టులోనూ ఉన్నారు. దీంతో ఫైనల్‌ పోరు హైవోల్టేజ్ మ్యాచ్‌గా జరుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే కేకేఆర్‌ను ఓడించడానికి హైదరాబాద్ ప్రత్యేక వ్యూహాలు రచిస్తోంది. ప్రత్యర్థి బలాల కంటే తమ బలహీనతలపై ఫోకస్ పెట్టింది.

ఈ క్రమంలో భారత యువ హిట్టర్ అబ్దుల్ సమద్‌పై వేటు వేయాలని మేనేజ్మెంట్ భావిస్తోంది. అబ్దుల్ ఈ సీజన్‌లో నిరాశపరిచాడు. క్వాలిఫయిర్-1తో పాటు క్వాలిఫయిర్-2లోనూ విఫలమయ్యాడు. ఫినిషర్‌గా జట్టుకు ఉపయోగపడతాడని సీజన్ ఆరంభం నుంచి ఇప్పటి వరకు అబ్దుల్‌కు అవకాశం ఇచ్చింది. కానీ ఈ యువ బ్యాటర్ అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయాడు. దీంతో అతని స్థానంలో మరో బ్యాటర్‌కు అవకాశం ఇవ్వాలని యాజమాన్యం భావిస్తోంది.

మరోవైపు ఫైనల్‌కు ఆతిథ్యం ఇచ్చే చెపాక్ పేస్ కంటే స్పిన్‌కు ఎక్కువగా అనుకూలిస్తోంది. దీంతో అబ్దుల్ సమద్ స్థానంలో వాషింగ్టన్ సుందర్‌కు ఛాన్స్ ఇవ్వాలని ఎస్‌ఆర్‌హెచ్ భావిస్తోంది. సుందర్ దూకుడుగా బ్యాటింగ్ చేయడంతో పాటు బంతితోనూ సత్తాచాటగలడు. అయితే పిచ్‌ను బట్టి ప్లాన్-బి కూడా సిద్ధంగా ఉంచుకోవాలని మేనేజ్మెంట్ భావిస్తుంది. స్పెషలిస్ట్ బ్యాటర్‌ అబ్దుల్ సమద్‌ను జట్టులోనే కొనసాగించి మార్క్‌రమ్‌కు బదులుగా గ్లెన్ ఫిలిప్స్‌ను బరిలోకి దించే ఆలోచనతోనూ ఉంది.

ఈ సీజన్‌లో ఫిలిప్స్ ఇప్పటివరకు ఆడలేదు. దీంతో ఫిలిప్స్ గురించి కేకేఆర్ దాదాపు ఎలాంటి ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేయదు. ప్రత్యర్థికి ఊహలకు అందకుండా ఫిలిప్స్‌ను బరిలోకి దించితే మంచి ఫలితం వస్తుందని ఎస్‌ఆర్‌హెచ్ భావిస్తోంది.

సన్‌రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు (అంచనా)
ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, గ్లెన్ ఫిలిప్స్/మార్క్‌రమ్, నితీశ్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, అబ్దుల్ సమద్/వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, ప్యాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్, నటరాజన్
ఇంపాక్ట్ ప్లేయర్: జయదేవ్ ఉనద్కత్

Story first published: Saturday, May 25, 2024, 17:35 [IST]
Other articles published on May 25, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+