అప్పట్లో అన్న కృనాల్ చూపించాడు.. ఇప్పుడు తమ్ముడు హార్దిక్, అన్నదమ్ముళ్లు ఇద్దరు ఇద్దరే.. !

ఐపీఎల్ 2022 సీజన్ టైటిల్‌ను గుజరాత్ టైటాన్స్ సగర్వంగా తమ హోం గ్రౌండ్ అయిన అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గెలుపొందిన సంగతి తెలిసిందే. రాజస్థాన్ రాయల్స్‌తో ఆదివారం జరిగిన ఫైనల్లో గుజరాత్ టైటాన్స్ 7వికెట్ల తేడాతో గెలుపొంది అరంగేట్రం చేసిన తొలి సీజన్లోనే టైటిల్ ముద్దాడిన జట్టుగా నిలిచింది. ఫైనల్లో ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్‌ను నిర్ణీత 20ఓవర్లలో 130పరుగులకే పరిమితం చేసిన హార్దిక్ సేన.. ఛేదనలో ఎంతో జాగ్రత్తగా ఆడి ట్రోఫీని ఒడిసిపట్టింది. 18.1 ఓవర్లలో 3 వికెట్లకు 133పరుగులు చేసి గెలుపొందింది. శుభ్‌మన్ గిల్(43 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 45 నాటౌట్), డేవిడ్ మిల్లర్(19 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 32 నాటౌట్), హార్దిక్ పాండ్యా(30 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 34) అద్భుతంగా ఆడి గుజరాత్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించారు. ఇక ఈ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా ఆడిన విధానాన్ని ఎంత మెచ్చుకున్న తక్కువే. ఇక ఈ మ్యాచ్‌లో తన ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా కూడా నిలిచాడు. ఇక ఫైనల్లో తన ప్రదర్శన ద్వారా అంతకుముందు తన అన్నయ్య కృనాల్ పాండ్యా సాధించిన ఓ ఘనతను తమ్ముడు హార్దిక్ కూడా అందుకున్నాడు.

ఫైనల్లో ఎలా ఆడాలో చూపించిన హార్దిక్ పాండ్యా
ఇక ఫైనల్‌లో కెప్టెన్ ఎలా ఆడాలో చూపించిన హార్దిక్ పాండ్యా.. 3/17అద్భుతమైన స్పెల్‌తో గుజరాత్ విజయానికి హార్దిక్ బాటలు వేశాడు. నాలుగు ఓవర్లలో కేవలం 17పరుగులు మాత్రమే ఇచ్చి జోస్ బట్లర్, శాంసన్, హెట్ మయర్ లాంటి విధ్వంస ప్లేయర్లను పెవిలియన్‌కు పంపించాడు. అలాగే బ్యాటింగ్లో (30 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 34) రాణించాడు. శుభ్ మాన్ గిల్‌తో కలిసి 63పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. తద్వారా ఈ మ్యాచ్‌లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుపొందాడు.

2017లోకృనాల్ పాండ్యా కూడా చేసి చూపించాడు
అంతకుముందు 2017లో ముంబై ఇండియన్స్, రైజింగ్ పూణె సూపర్‌జెయింట్స్ మధ్య జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లోకృనాల్ పాండ్యా తన అద్భుత ప్రదర్శన ద్వారా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. ముంబై తరపున అందరూ ప్లేయర్లు విఫలమైన వేళ కృనాల్ కీలకమైన (38బంతుల్లో 47పరుగులు) ప్రదర్శన చేశాడు. ప్రారంభంలోనే కుప్పకూలిన ముంబై ఇండియన్స్ స్కోరును 129కి చేర్చాడు. ఇక బౌలింగ్లో మిచెల్ జాన్సన్, జస్ప్రీత్ బుమ్రా మెరుపులు మెరిపించడంతో ఆ మ్యాచ్‌లో గెలిచిన ముంబై ఇండియన్స్.. ఐపీఎల్ విజేతగా నిలిచింది. ఇక ఈ మ్యాచ్ లోకృనాల్ పాండ్యా పోరాటానికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వచ్చింది.

ముంబైకి అన్నదమ్ముళ్లు ఎంతో చేశారు
అన్నదమ్ముళ్లయిన హార్దిక్ పాండ్యా,కృనాల్ పాండ్యా గతేడాది వరకు ముంబై ఇండియన్స్ తరఫున ఆడారు. 2022 మెగా వేలానికి ముందు హార్దిక్, కృనాల్‌లను ముంబై ఇండియన్స్ రిలీజ్ చేసింది. హార్దిక్‌ను గుజరాత్ టైటాన్స్ రిటైన్ చేసుకుని కెప్టెన్‌గా ప్రకటించింది. ఇకపోతే క్రునాల్‌ను వేలంలో మరో కొత్త జట్టు అయిన లక్నో సూపర్ జెయింట్స్ కొనుక్కుంది. ఈ ఇద్దరు అన్నదమ్ముళ్లు ఉన్న టైంలో ముంబై ఇండియన్స్ అత్యంత విజయవంతమైన జట్టుగా టోర్నీ చరిత్రలో కొనసాగింది. ఎందుకంటే ఇద్దరు బౌలింగ్, బ్యాటింగ్ పరంగా మంచి ప్రభావం చూపగల ఆటగాళ్లు. ఇక ఈ దఫా ముంబై వీరిద్దిరితో పాటు క్వింటన్ డికాక్, ట్రెంట్ బౌల్ట్ లాంటి మేటి ప్లేయర్లను మిస్ చేసుకోవడం వల్ల భారీ మూల్యం చెల్లించుకుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications