Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2022 Closing ceremony: రణవీర్ సింగ్, ఏఆర్ రెహమాన్ ఆటపాటతో అదిరిపోయే ముగింపు.. ఈసారి స్పెషల్ ఏంటంటే?

IPL Final 2022 Closing Ceremony: Date, Time, Guest List, Performances, Live Streaming Details

ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫైనల్‌కు చేరుకుంది. ఆదివారం జరగనున్న ఐపీఎల్ 2022 ఫైనల్ కోసం క్లోజింగ్ సెర్మనీని బీసీసీఐ గ్రాండ్‌గా ప్లాన్ చేసింది. మే 29న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో హార్దిక్ పాండ్యా సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్ (GT), సంజూ శాంసన్ నాయకత్వంలోని రాజస్థాన్ రాయల్స్ (RR) మధ్య ఫైనల్ జరగనుంది. ఇక ఈ మ్యాచ్ క్లోజింగ్ సెర్మనీ కారణం 30నిమిషాలు ఆలస్యంగా అంటే రాత్రి 8గంటలకు ప్రారంభం కానుంది. ఇక ఈ ముగింపు వేడుకలో బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ అదిరిపోయే స్టెప్పులతో అలరించనున్నారు.

అలాగే మ్యూజిక్ మాస్ట్రో, ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ ఈ వేదిక మీద తన సంగీతంతో ఉర్రూతలూగించనున్నారు. ఇకపోతే ఈ క్లోజింగ్ సెర్మనీలో స్పెషల్ అట్రాక్షన్‌గా జార్ఖండ్‌లోని ప్రసిద్ధ ఛౌ డ్యాన్స్ ను కూడా ప్రదర్శించనున్నారు. ఇందుకోసం జార్ఖండ్‌కు చెందిన ఛౌ డ్యాన్స్‌ చేసే 10మంది కళాకారుల బృందాన్ని బీసీసీఐ ఖరారు చేసింది.

ఇక సాయంత్రం 6.15pm నుంచి ఈ వేడుక ప్రారంభమై నలభై నిమిషాల పాటు సాగుతుంది. 7pm గంటలకు క్లోజింగ్ సెర్మనీ ముగుస్తుంది. తర్వాత 7.30కు ఇరు జట్ల కెప్టెన్లు టాస్ కోసం గ్రౌండ్లోకి వస్తారు. రాత్రి 8గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఇకపోతే రణవీర్ సింగ్ ఇటీవల ఓ మ్యాచ్‌లో స్టాండ్స్ నుండి ముంబై ఇండియన్స్‌కి తన మద్దతును ప్రకటించి అలరించిన సంగతి తెలిసిందే. ఇక ముగింపు వేడుకకు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, బీసీసీఐ గౌరవ కార్యదర్శి జయ్ షా, భారత మాజీ కెప్టెన్లు హాజరుకానున్నారు.

ఈ ముగింపు వేడుకలో ప్రత్యేకంగా భారతదేశ 75వ స్వాతంత్ర్య సంబరాలు జరుపుతారు. ఈ సందర్భంగా ఈ 75ఏళ్లలో ఇండియాలో క్రికెట్ ప్రస్థానం ఎలా సాగిందో చూపించేలా భారీ స్క్రీన్లపై ప్రజెంటేషన్ ఉంటుంది. తొలుత కరోనా వల్ల బీసీసీఐ క్లోజింగ్ సెర్మనీ నిర్వహించాలా వద్దా అనే డైలామాలో ఉంది. కానీ కరోనా కేసుల వ్యాప్తి అంత ఎక్కువగా లేకపోవడంతో బీసీసీఐ ముగింపు వేడుకను నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఇక స్టార్ స్పోర్ట్స్‌లో లైవ్ ప్రసారం అవుతుంది.

ఇకపోతే క్వాలిఫయర్ 1 మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ మీద గెలిచి నేరుగా గుజరాత్ టైటాన్స్ ఫైనల్ చేరగా.. క్వాలిఫయర్ 2లో ఆర్సీబీపై గెలిచిన రాజస్థాన్ ఫైనల్ చేరుకుంది. దీంతో 2008లో ప్రారంభ ఎడిషన్ తర్వాత మళ్లీ రాజస్థాన్ రాయల్స్ ఈ సీజన్లో ఫైనల్ చేరుకుంది. ఈ సీజన్లో రాజస్థాన్ టీం చాలా పటిష్టంగా ఉంది. ఇక గుజరాత్, రాజస్థాన్ రెండు టఫ్ టీంలే కావడంతో ఫైనల్లో ఎవరు గెలుస్తారనేదానిపై ఇంకా ఎలాంటి అంచనాలు వేయడానికి వీల్లేదు.

Story first published: Saturday, May 28, 2022, 12:36 [IST]
Other articles published on May 28, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+