Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్ ఫైనల్ 2019: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై

IPL 2019,Final: Mumbai Indians Wins Toss, Opts To Bat!! | టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై!
IPL Final 2019, MI vs CSK: Mumbai Indians win the toss and elect to bat

హైదరాబాద్: ఐపీఎల్ టోర్నీలో భాగంగా ముంబై ఇండియన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ తలపడుతున్నాయి. ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

ఇప్పటికే చెరో మూడుసార్లు ట్రోఫీని ముద్దాడిన ఈ రెండు జట్లు... ఈ మ్యాచ్‌లో నెగ్గే జట్టు నాలుగో సారి టైటిల్‌ నెగ్గి చరిత్ర సృష్టించే అవకాశం ఉంది. ఈ సీజన్‌లో చెన్నైపై లీగ్‌ దశలో రెండుసార్లు, క్వాలిఫయర్‌లో ఓసారి మొత్తం మూడు విజయాలను ముంబై ఇండియన్స్ నమోదు చేసింది.

దీంతో పాటు 2018 నుంచి రెండు జట్ల మధ్య ఐదు మ్యాచ్‌లు జరగ్గా నాలుగింటిలో ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. గతంలో చెన్నైతో జరిగిన మూడు ఫైనల్స్‌లోనూ రెండుసార్లు నెగ్గిన జోష్‌తో ముంబై ఆత్మవిశ్వాసంతో ఉంది. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ కావడంతో మ్యాచ్‌ని ప్రత్యేక్షంగా వీక్షించేందుకు అభిమానులు పెద్ద ఎత్తున స్టేడియానికి తరలి వస్తున్నారు.

హైదరాబాద్‌లో ఫైనల్‌ జరగడం ఇది రెండోసారి. వాస్తవానికి ఈ మ్యాచ్‌ డిఫెండింగ్‌ చాంపియన్‌ చెన్నై సొంత మైదానమైన చెపాక్‌ స్టేడియంలో జరగాల్సి ఉన్నా స్టాండ్స్‌ వివాదం కారణంగా హైదరాబాద్ ఆతిథ్యమిస్తోంది. 2013, 2015, 2017... ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ విజేతగా నిలిచిన సంవత్సరాలు.

1
45949

దీనిని బట్టి చూస్తే రెండేళ్ల గ్యాప్‌తో ఈ జట్టు కప్‌ కొడుతూ వస్తోంది. ఇప్పుడు 2019 వచ్చింది. ఈ సెంటిమెంట్‌ ఫలిస్తే ఉప్పల్‌లో విజేతగా నిలిచేది ముంబై ఇండియన్సే అని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.

జట్ల వివరాలు
చెన్నై సూపర్ కింగ్స్:
షేన్ వాట్సన్, డుప్లెసిస్, సురేశ్ రైనా, అంబటి రాయుడు, మహేంద్ర సింగ్ ధోని, డ్వేన్ బ్రావో, రవీంద్ర జడేజా, దీపక్‌ చహర్, హర్భజన్ సింగ్, ఇమ్రాన్ తాహిర్, శార్దుల్‌ ఠాకూర్

ముంబై ఇండియన్స్: క్వింటన్ డికాక్, రోహిత్ శర్మ, సూర్యకుమార్‌ యాదవ్, ఇషాన్‌ కిషన్, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, కీరన్ పొలార్డ్, మిచెల్ మెక్లన్‌గన్, రాహుల్‌ చహర్, లసిత్ మలింగ, జస్ప్రీత్ బుమ్రా.

Story first published: Sunday, May 12, 2019, 19:17 [IST]
Other articles published on May 12, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+