న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఉప్పల్‌లో ఐపీఎల్‌ సందడి: మ్యాచ్ చూసేందుకు వెళ్లిన వారిక శుభవార్త!

IPL 2019,Final: Telangana Gov Make's Special Arrangement's For IPL Fans At Uppal Stadium!!
IPL Final 2019, MI vs CSK: IPL final match at uppal stadium

హైదరాబాద్: ఐపీఎల్‌ 12వ సీజన్ తుది దశకు చేరుకుంది. ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ కావడంతో మ్యాచ్‌ని ప్రత్యేక్షంగా వీక్షించేందుకు అభిమానులు పెద్ద ఎత్తున స్టేడియానికి తరలి వస్తున్నారు.

ఉప్పల్‌ స్టేడియం వద్ద సందడి వాతావరణం

ఉప్పల్‌ స్టేడియం వద్ద సందడి వాతావరణం

దీంతో ఉప్పల్‌ స్టేడియం వద్ద సందడి వాతావరణం నెలకొంది. అభిమానులు భారీగా తరలివస్తున్న నేపథ్యంలో పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాట్లు చేశారు. స్టేడియం పరిసరాల్లో 2,800 మంది పోలీసులు పహారా కాస్తున్నారు. షీ టీమ్స్‌తో ప్రత్యేక నిఘా పెట్టారు. స్టేడియం పరిసర ప్రాంతాల్లో 300 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.

 క్షుణ్ణంగా తనిఖీలు

క్షుణ్ణంగా తనిఖీలు

ల్యాప్‌టాప్‌లు, పవర్ బ్యాంక్‌లను అనుమతించటం లేదు. కేవలం మొబైల్ ఫోన్లను మాత్రమే అనుమతిస్తున్నారు. సీసీ కెమెరాల ద్వారా అక్కడి పరిస్థితిని కంట్రోల్‌ రూమ్ ద్వారా పర్యవేక్షిస్తున్నారు. అభిమానులను క్షుణ్ణంగా తనిఖీలు చేసిన తర్వాతే మైదానంలోపలికి అనుమతిస్తున్నారు.

అర్ధరాత్రి ఒంటిగంట వరకూ మెట్రో రైళ్లు

అర్ధరాత్రి ఒంటిగంట వరకూ మెట్రో రైళ్లు

మరోవైపు మ్యాచ్ నేపథ్యంలో అర్ధరాత్రి ఒంటిగంట వరకూ మెట్రో రైళ్లు నడుస్తాయని హైదరాబాద్ మెట్రో ప్రకటించింది. దీంతో పాటు మ్యాచ్‌ ముగిసిన అనంతరం తిరిగి వెళ్లేందుకు వీలుగా అన్ని రూట్లలో బస్సులను నడపనున్నారు. ఇప్పటికే చెరో మూడుసార్లు ట్రోఫీని ముద్దాడిన ఈ రెండు జట్లు... ఈ మ్యాచ్‌లో నెగ్గే జట్టు నాలుగో సారి టైటిల్‌ నెగ్గి చరిత్ర సృష్టించే అవకాశం ఉంది.

 మూడు ఫైనల్స్‌లోనూ రెండుసార్లు

మూడు ఫైనల్స్‌లోనూ రెండుసార్లు

ఈ సీజన్‌లో చెన్నైపై లీగ్‌ దశలో రెండుసార్లు, క్వాలిఫయర్‌లో ఓసారి మొత్తం మూడు విజయాలను ముంబై ఇండియన్స్ నమోదు చేసింది. దీంతో పాటు 2018 నుంచి రెండు జట్ల మధ్య ఐదు మ్యాచ్‌లు జరగ్గా నాలుగింటిలో ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. గతంలో చెన్నైతో జరిగిన మూడు ఫైనల్స్‌లోనూ రెండుసార్లు నెగ్గిన జోష్‌తో ముంబై ఆత్మవిశ్వాసంతో ఉంది.

Story first published: Sunday, May 12, 2019, 19:02 [IST]
Other articles published on May 12, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X