
హైదరాబాద్: ఐపీఎల్ 12వ సీజన్ తుది దశకు చేరుకుంది. ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరిగే ఫైనల్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ కావడంతో మ్యాచ్‌ని ప్రత్యేక్షంగా వీక్షించేందుకు అభిమానులు పెద్ద ఎత్తున స్టేడియానికి తరలి వస్తున్నారు.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ని ఎలా ఎదుర్కోవాలో ముంబై ఇండియన్స్‌కి సూచిస్తూ ఓ అభిమాని రాసిన లెటర్ ఒకటి ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అయింది. ఈ లెటర్‌ని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తన అధికారిక ట్విట్టర్‌లో షేర్ చేసింది. ఈ లెటర్‌ను రాసింది సీఎస్‌కే అభిమాని కావడం విశేషం.
ఈ లెటర్‌లో అతడు జట్టు ఎంపికలో జాగ్రత్త వహించాలని ముంబై ఇండియన్స్ జట్టుకు సూచించాడు. దీంతో పాటు తుది జట్టులో ఏయే ఆటగాళ్లను తీసుకోవాలనే విషయాన్ని కూడా సదరు అభిమాని పేర్కొన్నాడు. పవర్ ప్లే ఓవర్లలో నాలుగు ఓవర్లలో చెన్నైని పరుగులు చేయకుండా కట్టడి చేయాలని, ఈ ఓవర్లలోనే సీఎస్‌కే ఓపెనర్లు డుప్లెసిస్, వాట్సన్‌లను ఔట్ చేయాలని పేర్కొన్నాడు.
ఇక, ముంబై విజయానికి రోహిత్ శర్మ, క్వింటన్ డికాక్‌ల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని రాసుకొచ్చాడు. హార్థిక్ పాండ్యాతో 8 నుంచి 16 ఓవర్ల మధ్యలో బౌలింగ్ చేయించాలని పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే, ఇప్పటికే చెరో మూడుసార్లు ట్రోఫీని ముద్దాడిన ఈ రెండు జట్లు... ఈ మ్యాచ్‌లో నెగ్గే జట్టు నాలుగో సారి టైటిల్ నెగ్గి చరిత్ర సృష్టించే అవకాశం ఉంది.