ముంబై: ఐపీఎల్ ఇండియాళ్ల సంబరం. ఈ సంబరాన్ని దేశంలోని క్రికెట్ అభిమానులకు మరింత చేరువ చేసేందుకు బీసీసీఐ ఫ్యాన్ పార్కులను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ వారం ఈ ఫ్యాన్ పార్కులు గుజరాత్‌లోని సూరత్, తెలంగాణలోని వరంగల్‌లో ఏర్పాటు చేయనున్నారు.
ఈ వారంలో సూరత్‌లోని లాల్ భాయ్ కాంట్రాక్టర్ స్టేడియం, తెలంగాణలో వరంగల్‌లోని జవహార్‌లాల్ నెహ్రూ స్టేడియంను ఫ్యాన్ పార్కులుగా ఎంపిక చేసినట్లు బీసీసీఐ సెక్రటరీ అనురాగ్ ఠాకూర్ చెప్పారు. గత వారంలో నడియాడ్, గుంటూరులో ఏర్పాటు చేసిన ఫ్యాన్ పార్కులు విజయవంతమైనట్లు తెలిపారు.

నడియాడ్, గుంటూరు పట్టణాల్లో ఏర్పాటు చేసిన పెప్సీ ఐపీఎల్ ఫ్యాన్ పార్కులో క్రికెట్ అభిమానుల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చిందని అన్నారు. గుంటూరులోని ఫ్యాన్ పార్కులో లైవ్ మ్యాచ్‌ని 20,000 మంది వీక్షించగా, నడియాడ్‌లోని ఫ్యాన్ పార్కులో 10,000 మంది క్రికెట్ అభిమానులు వీక్షించినట్లు మీడియా సమావేశంలో తెలిపారు.
దీంతో ఐపీఎల్‌లో మే 2న జరిగే మ్యాచ్‌లను గుజరాత్‌లో ఏర్పాటులో ఫ్యాన్ పార్కులో క్రికెట్ అభిమానులు వీక్షంచవచ్చు. అదే విధంగా మే 3న జరిగే మ్యాచ్‌లను వరంగల్‌లో ఏర్పాటు చేసిన ఫ్యాన్ పార్కులో మ్యాచ్‌లను వీక్షించవచ్చు. ఎంట్రీ ఉచితం. ఈ ఫ్యాన్ పార్కుల్లోకి అభిమానులను, నిర్వహకులు 2 గంటల ముందుగా అనుమతిస్తారు.

మే 2:
రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు Vs కోల్‌కత్తా నైట్ రైడర్స్ - (సాయంత్రం 4 గంటలకు)
చెన్నై సూపర్ కింగ్స్ Vs సన్ రైజర్స్ హైదరాబాద్ - (సాయంత్రం 8 గంటలకు)
మే 3:
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ Vs ముంబై ఇండియన్స్ - (సాయంత్రం 4 గంటలకు)
ఢిల్లీ డేర్ డెవిల్స్ Vs రాజస్ధాన్ రాయల్స్ - (సాయంత్రం 8 గంటలకు)
పెప్సీ ఐపీఎల్ 2015ను దేశ వ్యాప్తంగా 12 వేదికల్లో నిర్వహించనున్నారు. దేశంలోని 15 నగరాల్లోని పబ్లిక్ ప్లేసులో కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి వీక్షించేందుకు ఫ్యాన్ పార్కులను ఏర్పాటు చేస్తున్నారు. పెద్ద పెద్ద స్క్రీన్స్‌లో అచ్చం స్టేడియం లాంటి అనుభూతినే ఉచితంగా అందిస్తున్నారు.
ఈ ఫ్యాన్ పార్కుల్లో సుమారు 10,000 మంది వీక్షించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పిల్లలు, మహిళలకు ప్రత్యేకంగా స్పెషల్ ఏరియాలను కూడా కేటాయించనున్నారు. స్టేడియంలో మాదిరే మ్యూజిక్, పుట్ స్టాల్స్‌ను కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఐపీఎల్ మ్యాచ్‌లకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంఛైజీలే ఈ బాధ్యతను తీసుకుంటున్నాయి.