
హైదరాబాద్: బెంగళూరు వేదికగా జరిగిన ఐపీఎల్ వేలంలో రైట్ టు మ్యాచ్ (ఆర్టీఎం) ద్వారా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తనను తిరిగి దక్కించుకోవడంపై వెస్టిండిస్ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావో సంతోషం వ్యక్తం చేశాడు. జనవరి 27, 28 తేదీల్లో బెంగళూరులోని ఐటీసీ గార్డెనియా హోటల్లో జరిగిన వేలంలో రూ.6.4కోట్లకు చెన్నై బ్రావోను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో బ్రావో మాట్లాడుతూ 'చెన్నై సూపర్ కింగ్స్ తనను తిరిగి వేలంలో దక్కించుకోవడం సంతోషంగా ఉంది. నేను ఇప్పటి వరకు ఎన్నో టీ20 ఫ్రాంఛైజీల తరఫున ఆడాను. అన్నింటి కంటే ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహించడం నాకెంతో ఇష్టం' అని పేర్కొన్నాడు.
'వ్యక్తిగతంగా చెప్పాలంటే చెన్నై సూపర్ కింగ్స్ బెస్ట్ ఫ్రాంఛైజీ. ఈ ఏడాది మా జట్టు కెప్టెన్ ధోనీ, రైనా, జడేజాతో పాటు కొత్త జట్టు సభ్యులతో కలిసి ఆడేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ముంబై ఇండియన్స్ నుంచి వస్తోన్న నా పాత సహచరులు హర్భజన్ సింగ్, అంబటి రాయుడు త్వరలో పసుపు రంగు జెర్సీ ధరించనున్నారు' అని బ్రావో తెలిపాడు.
2011 నుంచి 2015 మధ్య కాలంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన డ్వేన్ బ్రావో 706 పరుగులు చేయడంతో పాటు 79 వికెట్లు తీశాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అత్యంత విజయవంతమైన జట్లలో చెన్నై సూపర్ కింగ్స్ ఒకటి. ధోని నేతృత్వంలోని చెన్నై జట్టు రెండు సార్లు ఐపీఎల్ విజేతగా నిలిచింది.
2013, 2015 ఐపీఎల్ సీజన్లలో అత్యధిక వికెట్లు తీసిన బ్రావో పర్పుల్ క్యాప్‌ని కూడా సొంతం చేసుకున్నాడు. దక్షిణాఫ్రికా పేసర్ లుంగీ ఎంగిడి తొలిసారి ఐపీఎల్‌లో అరంగేట్రం చేయనున్నాడు. వేలంలో చెన్నై ప్రాంఛైజీ లుంగీ ఎంగిడిని రూ. 50 లక్షలకు కొనుగోలు చేసింది. ఈ క్రమంలో ఎంగిడిని చెన్నై ఫ్యామిలీకో ఆహ్వానిస్తున్నామని అన్నాడు.
దీంతో ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌కింగ్స్ పునరాగమనం కోసం ఎంతో మంది అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఐపీఎల్ 11వ సీజన్ ఏప్రిల్ 7 నుంచి మే 27 వరకు జరగనుంది. తొలి మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరగనుంది.
చెన్నై సూపర్ కింగ్స్
1. ధోనీ (రూ.15 కోట్లు- Retained)
2. రైనా (రూ.11 కోట్లు- Retained)
3. జడేజా (రూ.7 కోట్లు- Retained)
4. డుప్లెస్సి (రూ.1.6 కోట్లు)
5. హర్భజన్ (రూ.2 కోట్లు)
6. డ్వేన్ బ్రేవో (రూ.6.4 కోట్లు)
7. షేన్ వాట్సన్ (రూ.4 కోట్లు)
8. కేదార్ జాదవ్ (రూ.7.8 కోట్లు)
9. అంబటి రాయుడు (రూ.2.2 కోట్లు)
10. ఇమ్రాన్ తాహిర్ (రూ.1 కోటి)
11. కరణ్ శర్మ (రూ.5 కోట్లు)
12. శార్దూల్ ఠాకూర్ (రూ.2.6 కోట్లు)
13. జగదీశన్ నారాయణ్ (రూ.20 లక్షలు)
14. మిచెల్ సాంట్నెర్ (రూ.50 లక్షలు)
15. దీపక్ చహర్ (రూ.80 లక్షలు)
16. ఆసిఫ్ కేఎం (రూ.40 లక్షలు)
17. లుంగి ఎంగిడి (రూ.50 లక్షలు)
18. కనిష్క్ సేథ్ (రూ.20 లక్షలు)
19. ధృవ్ షోరే (రూ.20 లక్షలు)
20. మురళీ విజయ్ (రూ.2 కోట్లు)
21. శామ్ బిల్లింగ్స్ (రూ.కోటి)
22. మార్క్ వుడ్ (రూ.1.5 కోట్లు)
23. క్షితిజ్ శర్మ (రూ.20 లక్షలు)
24. మోను సింగ్ (రూ.20 లక్షలు)
25. చైతన్య బిష్ణోయ్ (రూ.20 లక్షలు)
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.