For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

24 పరుగులకే 6 వికెట్లు: వాంఖడెలో ముంబై విజయం

ఐపీఎల్ పదో సీజన్‌లో భాగంగా శనివారం వాంఖెడె స్టేడియంలో ముంబై ఇండియన్స్, ఢిల్లీ డేర్ డెవిల్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ డేర్ డెవిల్స్ బౌలింగ్ ఎంచుకుంది.

By Nageshwara Rao

హైదరాబాద్: వాంఖడె స్టేడియంలో ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 14 పరుగుల తేడాతో విజయం సాధించింది. 143 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 128 పరుగులు చేసింది. చేధించాల్సిన లక్ష్యం తక్కువే అయినప్పటికీ, ఢిల్లీ జట్టు వెనువెంటనే కీలక వికెట్లు కోల్పోతూ పీకల్లోతూ కష్టాల్లో పడింది.

ముగ్గురు టాపార్డర్ ఆటగాళ్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. మరో ముగ్గురు బ్యాట్స్ మెన్స్ డకౌట్ కావడం గమనార్హం. రిషబ్ పంత్, ఆదిత్యా తారే, అండర్సన్‌లు ఖాతా తెరవకుండానే సున్నా పరుగుకే పెవిలియన్ బాట పట్టారు. మొదటి ఓవర్‌ నాలుగో బంతికి ఓపెనర్‌ ఆదిత్య తారేను హార్థిక్‌ పాండ్యా రనౌట్‌ చేయగా.. రెండో ఓవర్‌ రెండో బంతికి మరో ఓపెనర్‌ సంజు శాంసన్‌(9) మెక్లెనగన్‌ బౌలింగ్‌లో వెనుదిరిగాడు.

4వ ఓవర్‌లో శ్రేయస్‌ అయ్యర్‌(6), కోరె అండర్సన్‌(0) కూడా మెక్లెనగన్‌ బౌలింగ్‌లో పెవిలియన్‌ చేరారు. ఆరో ఓవర్‌ మూడో బంతికి రిషబ్ పంత్‌ డకౌట్‌గా వెనుదిరగగా, ఆ తర్వాత కరుణ్‌ నాయర్‌(5) కూడా పెవిలియన్‌ చేరాడు. ఇలా 24 పరుగులకే ఢిల్లీ 6 వికెట్లు కోల్పోయింది. ముంబై బౌలర్లు మెక్లెనగన్‌ మూడు వికెట్లు తీయగా, హార్ధిక్ పాండ్యా, బుమ్రా చెరో వికెట్ దక్కంచుకున్నారు. పాండ్యా తారేను రనౌట్ చేశాడు.

ఢిల్లీ విజయ లక్ష్యం 143

వాంఖడె స్టేడియంలో ముంబై మూగబోయింది. శనివారం ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై టాప్ ఆర్డర్ విఫలం కావడంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై వెనువెంటనే వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

దూకుడుతున్న ఆడుతున్న ముంబై ఓపెనర్ పార్థీవ్(8)ను ఢిల్లీ బౌలర్ రబడా క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత జోస్‌ బట్లర్‌ (18 బంతుల్లో 28; 3 ఫోర్లు, 2 సిక్సులు) పెవిలియన్‌కు చేరగా, ఆ వెంటనే బట్లర్‌ను శాంసన్ రనౌట్ చేశాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన నితీష్ రాణా కమిన్స్ బౌలింగ్‌లో‌ అవుటవ్వగా, రోహిత్ శర్మ అమిత్ మిశ్రా బౌలింగ్‌లో అవుటయ్యాడు.

Delhi send Mumbai to bat; Malinga misses out

ఈ తరుణంలో పొలార్డ్‌ (29 బంతుల్లో 26; 4 ఫోర్లు), హార్థిక్‌ పాండ్యా (23 బంతుల్లో 24; 2 సిక్సులు), కృణాల్‌ పాండ్యా (16 బంతుల్లో 17; 1×4) ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేసినా అమిత్ మిశ్రా వారిని కోలుకోనివ్వలేదు. దీంతో ముంబై 8 వికెట్లు కోల్పోయి 142 పరుగులు చేసింది.

ఏ ఒక్క బ్యాట్స్‌మన్ మూడు పదుల స్కోరైనా దాటలేదు. బట్లర్ 28, పొలార్డ్ 26, హార్ధిక్ పాండ్యా 24 మాత్రమే చెప్పుకోదగిన స్కోర్లు చేశారు. ముంబై ఆటగాళ్లలో జోస్ బట్లర్, హార్ధిక్ పాండ్యా, హర్భజన్ సింగ్ రనౌట్ అయ్యారు. అమిత్‌ మిశ్రా, పాట్‌ కమిన్స్‌‌లకు చెరో రెండు వికెట్లు తీయగా, రబడా ఓ వికెట్ దక్కింది.

Delhi send Mumbai to bat; Malinga misses out

ఈ సీజన్‌లో ఇప్పటివరకు ముంబై ఇండియన్స్ ఆరు మ్యాచ్‌లాడి ఐదింటిలో విజయం సాధించింది. ఇక అయిదు మ్యాచ్‌లాడిన ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు రెండింటిలో మాత్రమే విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో ముంబై అగ్రస్థానంలో ఉండగా, ఢిల్లీ ఐదో స్ధానంలో ఉంది.

ముంబై ఇండియన్స్:

P Patel, J Buttler, N Rana, RG Sharma, K Pollard, H Pandya, K Pandya, H Singh, J Bumrah, M McClenaghan, M Johnson

ఢిల్లీ డేర్ డెవిల్స్:
S Iyer, S Samson, K Nair, R Pant, C Morris, A Tare, C Anderson, P Cummins, K Rabada, A Mishra, Z Khan

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+