ఢిల్లీకి షాక్: సన్‌రైజర్స్‌తో జరిగే మ్యాచ్‌కి జహీర్‌ ఖాన్ దూరం

Posted By:

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పదో సీజన్‌లో ఢిల్లీ డేర్ డెవిల్స్‌కు మరో షాక్ తగిలింది. మంగళవారం ఢిల్లీలోని ఫిరోజ్‌ షా కోట్లా మైదానంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో మ్యాచ్‌కు జహీర్‌ఖాన్‌ అందుబాటులో ఉండడని ఫ్రాంఛైజీ అధికారికంగా వెల్లడించింది.

ఐపీఎల్ ప్రత్యేక వార్తలు | ఐపీఎల్ పాయింట్ల పట్టిక | ఐపీఎల్ 2017 ఫోటోలు

ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో గాయపడిన జహీర్ ఖాన్ ఇంకా కోలుకోలేదు. దీంతో అతడు సన్ రైజర్స్ హైదరాబాద్‌తో జరిగే మ్యాచ్‌కి అందుబాటులో ఉండటం లేదని ఢిల్లీ ప్రాంఛైజీ అధికారిక ప్రతినిధి ఒకరు తెలిపారు.

Delhi Daredevils captain Zaheer Khan ruled out of SRH game

ఆదివారం కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌కు జహీర్‌ ఖాన్ అందుబాటులో లేకపోవడంతో కరుణ్‌ నాయర్‌ కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. మంగళవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగే మ్యాచ్‌‌లో కూడా కరుణ్ నాయర్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టనున్నాడు.

తొలుత బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ 67 పరుగులకే ఆలౌటైంది. అనంతరం బరిలోకి దిగిన పంజాబ్‌ వికెట్‌ నష్టపోకుండా 10 వికెట్ల తేడాతో ఢిల్లీపై విజయం సాధించింది. ఐపీఎల్ పదో సీజన్‌లో ఇప్పటివరకు 8 మ్యాచ్‌లాడిన ఢిల్లీ కేవలం రెండింటిలో విజయం సాధించి పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్ధానంలో కొనసాగుతోంది.

Story first published: Monday, May 1, 2017, 22:53 [IST]
Other articles published on May 1, 2017

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి