న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్: 24 బంతులు.. 20 డాట్‌బాల్స్‌

IPL: CSK Bowler Deepak Chahar Breaks IPL Dot Ball Record

ఐపీఎల్ అంటేనే బ్యాట్స్‌మన్‌లు చెలరేగుతారు. ప్రపంచ క్రికెట్‌లో ఎంతమంచి బౌలర్ అయినా.. ఏదో ఒక రోజు పరుగులు సమర్పించుకోవాల్సిందే. సమర్పించుకోవడం అంటే తన కోటా 4 ఓవర్లలో 40-50 పరుగులు కూడా ఇచ్చిన టాప్ బౌలర్లు ఉన్నారు. మరి అన్ని పరుగులు ఇచ్చారంటే అందులో డాట్‌బాల్స్‌ సంఖ్య ఎంత ఉంటుందో మనమే ఊహించుకోవచ్చు.

అలాంటిది ఐపీఎల్ ఆటలో ఓ యువ బౌలర్ ఓ ఇన్నింగ్స్‌లో ఏకంగా 20 డాట్‌బాల్స్‌ వేసాడు. అతనే చెన్నై సూపర్‌కింగ్స్‌ పేసర్‌ దీపక్‌ చాహర్‌. మంగళవారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చాహర్‌.. 4 ఓవర్లలో 20 డాట్‌బాల్స్‌ వేసాడు. దీంతో ఐపీఎల్‌లో రికార్డు నెలకొల్పాడు.

IPL: CSK Bowler Deepak Chahar Breaks IPL Dot Ball Record

ఐపీఎల్‌లో ఓ ఇన్నింగ్స్‌లో రషీద్‌ ఖాన్‌ (సన్‌రైజర్స్‌), అంకిత్‌ రాజ్‌పుత్‌ (పంజాబ్‌)లు అత్యధికంగా 18 డాట్‌బాల్స్‌ వేశారు. తాజాగా దీపక్‌ చాహర్‌ 20 డాట్‌బాల్స్‌తో వీరి రికార్డును బద్దలుకొట్టాడు. ఈ మ్యాచ్‌లో చాహర్‌ 4 ఓవర్లలో 20 పరుగులిచ్చి 3 వికెట్లు (క్రిస్ లిన్, ఉతప్ప, నితీష్ రాణా) పడగొట్టాడు. ఈ సంచలన ప్రదర్శనతో దీపక్‌ చాహర్‌ 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' అవార్డు గెలుచుకున్నాడు. ప్రస్తుతం దీపక్‌ చాహరే చెన్నై ప్రధాన బౌలర్ గా మారాడు.

Story first published: Thursday, April 11, 2019, 14:48 [IST]
Other articles published on Apr 11, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X