Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL: CSK vs SRH హెడ్ టూ హెడ్ రికార్డ్సు.. పై చేయి ఎవ‌రిదంటే..

IPL: Chennai Super Kings vs Sunrisers Hyderabad Head to head Records

ఐపీఎల్ 2022లో నేడు మ‌రో ఆసక్తిక‌ర పోరు జ‌ర‌గ‌నుంది. డిఫెండింగ్ ఛాంపియ‌న్ చెన్నైసూప‌ర్ కింగ్స్‌, మాజీ ఛాంపియ‌న్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ నేటి మ్యాచ్‌లో త‌ల‌ప‌డ‌నున్నాయి. డివై పాటిల్ స్టేడియం వేదిక‌గా మ‌ధ్యాహ్నం 3:30 గంట‌ల‌కు ఈ మ్యాచ్ ప్రారంభంకానుంది. ఈ సీజ‌న్‌లో ఇరు జ‌ట్లు ఇప్ప‌టివ‌ర‌కు బోణీ చేయ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఇప్ప‌టివ‌ర‌కు ఆడిన 3 మ్యాచ్‌ల్లో చెన్నైసూప‌ర్ కింగ్స్ ఓడ‌గా.. ఆడిన రెండు మ్యాచ్‌ల్లో స‌న్‌రైజ‌ర్స్ హైదరాబాద్ ఓడింది. దీంతో ఈ మ్యాచ్‌లో గెలిచి సీజ‌న్‌లో తొలి విజ‌యం సాధించాల‌ని రెండు జ‌ట్లు ప‌ట్టుద‌ల‌గా ఉన్నాయి. మొత్తంగా రెండింట్లో ఏదో ఒక జ‌ట్టు నేటి మ్యాచ్‌లో త‌మ విజ‌యాల ఖాతాను తెర‌వ‌నుంది.

ఈ క్ర‌మంలో ఐపీఎల్‌లో ఇప్ప‌టివ‌ర‌కు రెండు జ‌ట్ల హెడ్ టూ హెడ్ రికార్డుల‌ను ఒక సారి గ‌మ‌నిస్తే చెన్నైసూప‌ర్ కింగ్స్‌దే పై చేయిగా ఉంది. ఇప్ప‌టివ‌ర‌కు రెండు జ‌ట్లు 16 మ్యాచ్‌ల్లో త‌ల‌ప‌డ‌గా.. చెన్నైసూప‌ర్ కింగ్స్ 12 మ్యాచ్‌ల్లో విజ‌యం సాధించింది. స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ 4 మ్యాచ్‌ల్లోనే గెల‌వ‌డం గ‌మ‌నార్హం. రెండు జ‌ట్లు త‌ల‌ప‌డిన మ్యాచ్‌ల్లో ఓ మ్యాచ్‌లో స‌న్‌రైజ‌ర్స్ అత్య‌ధికంగా 192 ప‌రుగులు చేయ‌గా.. చెన్నైసూప‌ర్ కింగ్స్ 223 ప‌రుగులు చేసింది. ఇక అత్య‌ల్పంగా స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ 134 ప‌రుగులు.. చెన్నైసూప‌ర్ కింగ్స్ 132 ప‌రుగులు చేసింది. ఇక చివ‌రి 5 మ్యాచ్‌ల్లో చెన్నైసూప‌ర్ కింగ్స్ 3 గెల‌వ‌గా.. స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ 2 గెలిచింది.

చెన్నై సూపర్ కింగ్స్ స్క్వాడ్
రవీంద్ర జడేజా (కెప్టెన్), ధోని (వికెట్ కీప‌ర్), రాబిన్ ఉతప్ప, రుతురాజ్ గైక్వాడ్, మొయిన్ అలీ, అంబటి రాయుడు, శివమ్ దూబే, డ్వేన్ బ్రావో, డ్వైన్ ప్రిటోరియస్, క్రిస్ జోర్డాన్, ముఖేష్ చౌదరి, డెవాన్ కాన్వే, తుషార్ దేశ్‌పాండే మిల్నే, మిచెల్ సాంట్నర్, హరి నిశాంత్, ఎన్ జగదీశన్, సుభ్రాంశు సేనాపతి, ప్రశాంత్ సోలంకి, ఆసిఫ్, సిమర్జీత్ సింగ్, రాజవర్ధన్ హంగర్గేకర్, మహేశ్ తీక్షణ, భగత్ వర్మ

సన్‌రైజర్స్ హైదరాబాద్ స్క్వాడ్
కేన్ విలియమ్సన్ (కెప్టెన్‌), నికోలస్ పూరన్ (వికెట్ కీప‌ర్), అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్‌రామ్, వాషింగ్టన్ సుందర్, అబ్దుల్ సమద్, రొమారియో షెపర్డ్, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్, టి నటరాజన్, విష్ణు వినోద్, ప్రియాం గార్గ్, కార్తీక్ త్యాగి, ఫజల్హాక్ ఫరూఖీ, మార్కో జాన్సెన్, సౌరభ్ దూబే, శశాంక్ సింగ్, గ్లెన్ ఫిలిప్స్, జగదీశ సుచిత్, శ్రేయాస్ గోపాల్, రవికుమార్ సమర్థ్

Story first published: Saturday, April 9, 2022, 12:25 [IST]
Other articles published on Apr 9, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+