For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్: ధావన్ హాఫ్ సెంచరీ, చెన్నై విజయ లక్ష్యం 148

Chennai Super Kings

హైదరాబాద్: ఐపీఎల్‌లో భాగంగా ఫిరోజ్ షా కోట్లా వేదికగా చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 147 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీని చెన్నై బౌలర్లు కట్టడి చేయడంతో ఆ జట్టు సాధారణ స్కోరుకే పరిమితమైంది.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

ఇన్నింగ్స్‌ ఆరంభంలోనే దూకుడుగా ఆడుతున్న యువ ఓపెనర్‌ పృథ్వీ షా(24; 16 బంతుల్లో 5 ఫోర్లు) జట్టు స్కోరు 36 వద్ద ఔటవ్వగా... శిఖర్‌ ధావన్‌(51: 47 బంతుల్లో 7ఫోర్లు) హాఫ్ సెంచరీతో రాణించాడు. ఆ తర్వాత క్రీజులోకి దిగిన శ్రేయస్‌ అయ్యర్‌ (18; 20 బంతుల్లో 1 సిక్స్‌)తో కలిసి ధావన్ ఇన్నింగ్స్‌ను సరిదిద్దాడు.

కీలక సమయంలో శ్రేయాస్‌ అయ్యర్‌ను ఇమ్రాన్‌ తాహిర్‌ ఎల్బీగా పెవిలియన్‌కు చేర్చాడు. ఆ తర్వాత ప్రమాదకరంగా మారుతున్న రిషబ్‌ పంత్‌(25;13 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌) బ్రావో వేసిన భారీ షాట్‌ ఆడి.. బౌండరీ లైన్‌ వద్ద శార్దుల్‌ ఠాకూర్‌ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌‌‌‌కు చేరాడు. ఈ క్రమంలో 15.2 ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయి 120 పరుగులతో పటిష్ట స్థితిలో ఉన్న ఢిల్లీ ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయింది.

శిఖర్ ధావన్‌ దూకుడుగా ఆడే క్రమంలో డ్వేన్‌ బ్రావో వేసిన 18వ ఓవర్‌ తొలి బంతికే వెనుదిరిగాడు. ధావన్‌ హాఫ్‌ సెంచరీ సాధించినప్పటికీ భారీ షాట్లు కొట్టడంలో తడబడ్డాడు. దీంతో భారీ స్కోరు చేసే అవకాశాన్ని ఢిల్లీ చేజార్చుకుంది. చివర్లో రాహుల్‌ తెవాతియా(11 నాటౌట్‌), అక్షర్‌ పటేల్‌(9 నాటౌట్‌)లు తలో బౌండరీ సాధించడంతో ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది.

చెన్నై బౌలర్లలో డ్వేన్‌ బ్రేవో మూడు వికెట్లు సాధించగా, దీపక్‌ చాహర్‌, రవీంద్ర జడేజా, ఇమ్రాన్‌ తాహీర్‌లకు తలో వికెట్‌ దక్కింది.

Story first published: Tuesday, March 26, 2019, 23:20 [IST]
Other articles published on Mar 26, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+