Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL Cheerleaders: చీర్ లీడర్స్‌ను ఎలా ఎంపిక చేస్తారు.. వారికి ఎంత జీతం వస్తుందో తెలుసా?

IPL Cheerleaders: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025లో ఇప్పటివరకు 24 మ్యాచ్ లు జరిగాయి. ఈ సమయంలో ఒకదాని తర్వాత ఒకటి ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లు జరుగుతున్నాయి. ఐపీఎల్ 18వ సీజన్ లో చాలా మంది కొత్త ప్లేయర్లు తమదైన ముద్ర వేశారు. అయితే ఐపీఎల్ టోర్నమెంట్‌లో టాప్ ప్లేయర్లు ఎంత ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారో.. అంతకంటే ఎక్కువగా చీర్ లీడర్స్ తమ డ్యాన్స్‌తో ఆకట్టుకుంటారు. మ్యాచ్ సమయంలో ఫోర్, సిక్స్ కొట్టినప్పుడల్లా వికెట్ పడినప్పుడు.. అభిమానులతో పాటు చీర్ లీడర్స్ తమ టీమ్ ను ఎంకరేజ్ చేస్తారు. ఇది ఐపీఎల్ కు మరింత ఆకర్షణను తీసుకొస్తుంది. ఇది మాత్రమే కాకుండా చీర్ లీడర్స్ కూడా మ్యాచ్ సమయంలో వాతావరణానికి ఉత్సాహాన్ని జోడిస్తారు. అయితే చాలా మందికి ఈ చీర్ లీడర్స్ ను ఎలా ఎంపిక చేస్తారు.. వారికి ఎంత జీతం వస్తుందనే వివరాలు తెలియకపోవచ్చు. ఈ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

వేర్వేరు జీతాలు ఇస్తున్న ఫ్రాంచైజీలు
ఐపీఎల్ లో కనిపించే చీర్ లీడర్స్‌లో ఎక్కువ మంది రష్యా, ఉక్రెయిన్, బ్రెజిల్, అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాల నుంచి వచ్చారు. అది మాత్రమే కాకుండా కొంతమంది భారతీయులు కూడా ఈ వృత్తిలో ఉన్నారు. అయితే చాలా ఫ్రాంచైజీలు విదేశీ చీర్ లీడర్స్ ను ఇష్టపడతాయి. చీర్ లీడర్స్ జీతం గురించి చెప్పాలంటే.. వేర్వేరు ఫ్రాంచెజీలు చీర్ లీడర్స్ కు వేర్వేరు జీతాలు చెల్లిస్తాయి. ఇది మాత్రమే కాకుండా వారు మరికొన్ని సౌకర్యాలు, ప్రోత్సాహకాలను కూడా పొందుతారు. వారికి బోనస్ కూడా లభిస్తుంది.

IPL Cheerleaders are Selection Process and Their Salaries All You Need to Know

మీడియా నివేదికల ప్రకారం.. కోల్‌కతా నైట్ రైడర్స్ చీర్ లీడర్స్ కు మ్యాచ్ కు రూ.24,000-25,000.. ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు రూ.20,000, చెన్నై సూపర్ కింగ్స్ రూ.17,000, పంజాబ్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ రూ.12,000-15,000 చెల్లిస్తున్నాయి. దీనితో పాటు జట్టు బాగా రాణిస్తే చీర్ లీడర్స్‌కు కూడా బోనస్‌లు లభిస్తాయి.జీతంతో పాటు ఫ్రాంచెజీ చీర్ లీడర్స్ కు కొన్ని సౌకర్యాలను కూడా అందిస్తారు. ఇందులో ప్రయాణ ఖర్చులు, హోటల్ బస, ఆహారం, వైద్య సౌకర్యాలు ఉన్నాయి.

చీర్ లీడర్స్ ఎంపిక ప్రక్రియ
ఐపీఎల్ లో చీర్ లీడర్స్ ఎంపిక ప్రక్రియ భిన్నంగా ఉంటుంది. చీర్ లీడర్స్ కోసం ఆన్ లైన్, ఆఫ్ లైన్ ఆడిషన్లు ఉంటాయి. ఆ సమయంలో వారి డ్యాన్స్ స్కిల్స్ పరీక్షించబడతాయి. ఐపీఎల్ లో చీర్ లీడర్ గా మారాలంటే గొప్ప డ్యాన్స్ మూమెంట్స్ వచ్చి ఉండాలి. చీర్ లీడర్స్ కు మంచి శక్తి ఉండటం కూడా ముఖ్యమే. వీటితో పాటు వారి ఆత్మవిశ్వాసం, కమ్యూనికేషన్ నైపుణ్యాలను కూడా పరిశీలిస్తారు. ఐపీఎల్ ఫ్రాంచైజీలు చీర్ లీడర్స్ ను నేరుగా ఎంపిక చేయవు. దీనికోసం ఏజెన్సీ సహాయం తీసుకుంటారు.

Story first published: Friday, April 11, 2025, 22:02 [IST]
Other articles published on Apr 11, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+