బెట్టింగ్‌కు పాల్పడ్డా... కోట్లు నష్టపోయా: పోలీసుల ఎదుట సల్మాన్ సోదరుడు

హైదరాబాద్: ఐపీఎల్‌లో తాను బెట్టింగ్‌కు పాల్పడినట్లు బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ సోదరుడు, నిర్మాత అర్బాజ్ ఖాన్ పోలీసుల విచారణలో అంగీకరించాడు. మహారాష్ట్రలోని థానే పోలీసుల ఎదుట శనివారం విచారణకు హాజరైన అర్బాజ్ ఈ మేరకు తన నేరాన్ని అంగీకరించాడు. అయితే, ఐపీఎల్ 11వ సీజన్‌లో తాను ఎలాంటి బెట్టింగ్‌కు పాల్పడలేదని స్పష్టం చేశాడు.
ఇటీవల ముగిసిన ఐపీఎల్‌లో బెట్టింగ్‌ల కేసుపై దర్యాప్తు జరుపుతుండగా అందులో అర్బాజ్ ఖాన్ పేరు రావడంతో అతనికి థానె పోలీసులు సమన్లు జారీ చేశారు. దీంతో అతడు శనివారం విచారణకు హాజరయ్యాడు. దీంతో పోలీసులు అతడి వాంగ్మూలాన్ని పోలీసులు నమోదు చేశారు.

ఐదు గంటలకు పైగా అర్బాన్‌ను విచారించిన పోలీసులు
ఈ బెట్టింగ్ కేసులో ఇంతకుముందే అరెస్టు చేసిన బుకీ సోను జలాన్‌తో సహా అర్బాజ్ ఖాన్‌ను సుమారు ఐదు గంటలకు పైగా పోలీసులు విచారించినట్లు తెలిసింది. విచారణలో అర్బాజ్ ఖాన్ పలు సంచలన విషయాలు వెల్లడించాడు. తొలుత బుకీలతో తనకేం సంబంధం లేదని అర్బాజ్ బుకాయించినప్పటికీ.. గతంలో అర్బాజ్‌ను బెదిరిస్తూ బుకీ జలన్ చేసిన చాటింగ్ వివరాలను పోలీసులు చూపించడంతో అసలు విషయాలను బయటపెట్టాడు. గత ఆరేళ్లుగా బుకీ సోనూ జలన్ తెలుసని విచారణలో అర్బాజ్ ఖాన్ ఒప్పుకున్నాడు.
విచారణలో పోలీసులకు సహకరిస్తూనే ఉంటా
విచారణ అనంతరం అర్బాజ్ ఖాన్ విలేకరులతో మాట్లాడుతూ 'నేను ఇచ్చిన వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డు చేశారు. ఈ దర్యాప్తులో పోలీసులకు కావాల్సిన సమాచారంపై నన్ను ప్రశ్నించారు. వాటన్నింటికి సమాధానం చెప్పాను. విచారణలో పోలీసులకు సహకరిస్తూనే ఉంటా' అని అర్బాజ్ పేర్కొన్నాడు. ఐపీఎల్ మ్యాచ్‌ల బెట్టింగ్‌లో అర్బాజ్ ఖాన్ రూ.2.80కోట్లు నష్టపోయాడని, వాటిని బుకీలకు చెల్లించడంలేదని సీనియర్ పోలీస్ అధికారి ఒకరు వెల్లడించారు.

జలన్‌తోపాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
ఐపీఎల్ బెట్టింగ్ కేసు దర్యాప్తులో భాగంగా బుకీ జలన్‌తోపాటు మరో ముగ్గురిని మేన 16న థానే పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. వీరిని విచారించగా విస్మయానికి గురిచేసే అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ బెట్టింగ్ రాకెట్‌లో పాల్గొన్న 100 మంది బుకీలతోపాటు ఇందులో భాగస్వామ్యమైన ప్రముఖుల పేర్లనూ జలన్ తన డైరీలో రాసుకున్నట్లు పోలీస్ అధికారి ఒకరు చెప్పారు.
దుబాయ్‌లోని ఓ హోటల్ కేంద్రంగా బెట్టింగ్
ఐపీఎల్ 2018లోనూ వేలకోట్ల బెట్టింగ్ జరిగిందని, పారిశ్రామిక వేత్తలతోపాటు పలువురు బాలీవుడ్ తారలు ఇందులో పాల్గొన్నారని జలన్ విచారణలో తెలిపినట్లు పోలీసులు వెల్లడించారు. దుబాయ్‌లోని ఓ హోటల్ కేంద్రంగా బాలీవుడ్ సెలబ్రిటీలు బుకీలతో నేరుగా సంప్రతింపులు జరిపారని పేర్కొన్నాడు. గతంలో జరిగిన ఐపీఎల్ సీజన్లలో జరిగిన బెట్టింగ్ వ్యవహారాలతోపాటు ఈ సీజన్‌లోనూ కోట్ల రూపాయలు చేతులు మారిన సంగతి తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications