Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్ వేలం: గత పదేళ్లలో అత్యధిక ధర పలికిన ఆటగాళ్లు (ధోని నుంచి స్టోక్స్ వరకు)

హైదరాబాద్: 10 ఏళ్ల ఐపీఎల్ సక్సెస్‌తో పాటు వివాదాలను కూడా చూసింది. ఈ టీ20 క్రికెట్ టోర్నీ ప్రపంచ క్రికెట్‌ ముఖ చిత్రాన్నే మార్చివేసింది. ఎంతలా అంటే క్రికెట్ ఆడే ప్రతి క్రికెటర్ కూడా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఒక్కసారన్నా ఆడాలి అనేంతలా. అలాంటి ఐపీఎల్ 10 సీజన్లను పూర్తి చేసుకుని 11వ సీజన్‌లోకి అడుగుపెట్టింది.

11వ సీజన్ కోసం జనవరి 27, 28 తేదీల్లో బెంగళూరు వేదికగా వేలం జరగనుంది. ఈ వేలంలో ఇప్పటికే 578 క్రికెటర్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఇందులోని అత్యుత్తమ ఆటగాళ్లను ప్రాంఛైజీలు కొట్లు కుమ్మరించి కొనుగోలు చేసేందుకు సిద్ధమయ్యాయి. ఈ వేలంలో ప్లేయర్ అత్యధిక ధర రూ. 2 కోట్లుగా నిర్ణయించారు.

ఈ రూ. 2 కోట్ల జాబితాలో మొత్తం 36 మంది ఆటగాళ్లు ఉన్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మొట్టమొదటి వేలంను ఫిబ్రవరి 20, 2008లో ముంబైలో నిర్వహించారు. ఆ వేలంలో మహేంద్ర సింగ్ ధోనిని చెన్నై సూపర్ కింగ్స్ ప్రాంచైజీ $1.5 మిలియన్లకు కోనుగోలు చేసింది.

వీరిద్దరి కలయిక ఐపీఎల్‌లో ఓ ట్రెండ్ సెట్టర్ అయింది. ధోని నేతృత్వంలోన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు రెండు సార్లు ఐపీఎల్ విజేతగా నిలిచింది. ధోని కోనుగోలు తర్వాత జరిగిన ఐపీఎల్ వేలంలో అనేక మంది ఆటగాళ్లు అత్యధిక ధర పలికి చరిత్ర సృష్టించారు. ధోని తర్వాత వేలంలో అత్యధిక ధర పలికిన ఆటగాళ్లలో యువీ, బెన్ స్టోక్స్ నిలిచారు.

10 ఏళ్ల ఐపీఎల్‌లో 2008 నుంచి 2017 వరకు అత్యధిక ధర పలికిన ఆటగాళ్ల జాబితాను ఒక్కసారి పరిశీలిస్తే:
* 2008 - ధోని ($1.5 million) - చెన్నై సూపర్ కింగ్స్ (CSK)
* 2009 - ఆండ్రూ ఫ్లింటాఫ్ (ఇంగ్లాండ్) ($1.5 million) - CSK; కెవిన్ పీటర్సన్ (ఇంగ్లాండ్) ($1.5 million) - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)
* 2010 - షేన్ బాండ్ ($750,000+) - కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR); కీరన్ పొలార్డ్ ($750,000+) - ముంబై ఇండియన్స్ (MI)
* 2011 - గౌతం గంభీర ($2.4 million) - KKR
* 2012 - రవీంద్ర జడేజా ($2 million+) - CSK
* 2013 - గ్లెన్ మ్యాక్స్‌వెల్ (ఆస్ట్రేలియా) ($1 million) - MI
* 2014 - యువరాజ్ సింగ్ (రూ. 14 కోట్లు) - RCB
* 2015 - యువరాజ్ సింగ్ (రూ. 16 కోట్లు) - ఢిల్లీ డేర్ డెవిల్స్
* 2016 - షేన్ వాట్సన్ (ఆస్ట్రేలియా) (రూ 9.5 కోట్లు) - RCB
* 2017 - బెన్ స్టోక్స్ (ఇంగ్లాండ్) (రూ 14.5 కోట్లు) - రైజింగ్ పూణె సూపర్ జెయింట్ (RPS)

పైన పేర్కొన్న ఆటగాళ్లు వేలంలో అత్యధిక ధర పలికిన ఆటగాళ్లు. అయితే ఐపీఎల్ 11వ సీజన్ కోసం ప్రాంఛైజీలు తమ వద్ద అట్టిపెట్టుకున్న ఆటగాళ్లు ఇంకా ఎక్కువ మొత్తంలో ధర పలికారు. ఈ ఏడాది విరాట్ కోహ్లీకి రూ. 17 కోట్లు చెల్లించి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రాంఛైజీ తన వద్దే అట్టిపెట్టుకుంది.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Tuesday, January 23, 2018, 13:48 [IST]
Other articles published on Jan 23, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+