Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్ వేలంలో ఆటగాళ్లు పలికిన ధర ఆటకు కొలమానం కాదు

IPL Auction value has no rationale, it is supply and demand, says Sourav Ganguly

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వేలంలో ఆటగాళ్లు పలికిన ధర అతడి ఆటకు కొలమానం కాదని టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ స్పష్టం చేశాడు. ఇటీవలే బెంగళూరు వేదికగా జరిగిన ఐపీఎల్ వేలంలో కొందరు ఆటగాళ్లను ప్రాంఛైజీలు కోట్లు కుమ్మరించి కొనుగోలు చేశాయి.

టీమిండియా వెటరన్ క్రికెటర్లు యువరాజ్ సింగ్, గౌతం గంభీర్‌లను ప్రాంఛైజీలు కనీస ధరకే కొనుగోలు చేయగా, వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహాను సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ.5 కోట్లకు, మరో వికెట్ కీపర్ దినేష్ కార్తీక్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ రూ.7.4 కోట్లకు కొనుగోలు చేశాయి.

మరోవైపు అండర్-19 వరల్డ్ కప్‌లో అద్భుత ప్రదర్శన చేస్తోన్న శివమ్ మావిని రూ. 3 కోట్లకు, కమలేష్ నాగర్‌కోటిలను రూ. 3.6 కోట్లకు ప్రాంఛైజీలు కొనుగోలు చేశాయి. ఈ నేపథ్యంలో 'క్రికెట్ ఇయర్ బుక్' 20వ వార్షికోత్సవంలో పాల్గొన్న సౌరవ్ గంగూలీని మీడియా ప్రతినిధులు వేలంపై కొన్ని ప్రశ్నలు వేశారు.

ఐపీఎల్‌లో ధర అనేది డిమాండ్-సప్లైపై ఆధారపడి ఉంటుందని పేర్కొన్నాడు. ఐపీఎల్‌లో పలికిన ధర ఆధారంగా క్రికెటర్ల ప్రతిభను నిర్ణయించలేమని గంగూలీ స్పష్టం చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 54 సెంచరీలు చేసిన దక్షిణాఫ్రికా ఆటగాడు హషీమ్ ఆమ్లా వేలంలో అమ్ముడుపోలేదని గుర్తు చేశాడు.

కేవలం రంజీ ట్రోఫీలో మాత్రమే ఆడిన ఢిల్లీ ఆటగాడు ఇషాన్ కిషన్‌ను ముంబై ఇండియన్స్ రూ.6.2 కోట్లకు కొనుగోలు చేసిందని ఈ సందర్భంగా గంగూలీ వివరించాడు. కాబట్టి ఐపీఎల్ సొమ్ము ఆటగాళ్ల ప్రతిభను కొలిచే కొలమానం కాదని దాదా తేల్చి చెప్పాడు. ఐపీఎల్ అనేది ప్రత్యేకమని, దానిని ఆ దృష్టితోనే చూడాలని అన్నాడు.

ఫలితంగా అత్యధిక ధర పలికిన దేశీయ ఆటగాడిగా జయదేవ్ చరిత్ర సృష్టించాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో భారత జట్టు గెలవాలంటే కెప్టెన్ కోహ్లీ పరుగులు సాధించాల్సి ఉంటుందని గంగూలీ అన్నాడు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Friday, February 2, 2018, 11:06 [IST]
Other articles published on Feb 2, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+