
2016లో ఛాంపియన్‌గా:
గత ఐదేళ్ళుగా బౌలింగ్ నైపుణ్యంతో ఐపీఎల్‌పై తనదైన ముద్రవేసింది సన్‌రైజర్స్. 2016లో ఛాంపియన్‌గా కూడా నిలిచింది. నాణ్యమైన బౌలింగ్ విభాగంపైనే దృష్టిసారించిన సన్‌రైజర్స్ అనుకున్న ఆటగాళ్ళను ఎంపిక చేసుకోవడంలో సఫలమైంది.

బ్యాట్స్‌మెన్ కోసం మనీశ్ పాండే:
ఇప్పటివరకు ఓపెనింగ్‌లో వార్నర్ లేదా ధావన్ ఎవరో ఒకరు విజయవంతమైతే సరే. ఒకవేళ ఇద్దరూ విఫలమైతే సన్‌రైజర్స్ 140 పరుగులు చేయడం లేదా ఛేదించడం దాదాపుగా అసాధ్యమన్న అభిప్రాయం ఉంది. దీంతో నాణ్యమైన బ్యాట్స్‌మన్ వేటలో మనీష్ పాండేవైపు సన్‌రైజర్స్ మొగ్గుచూపింది. మూడు లేదా నాలుగో స్థానంలో ఆధారపడదగ్గ బ్యాట్స్‌మన్‌గా పాండేపై విశ్వాసముంచిన సన్‌రైజర్స్ అతని కోసం రూ.11 కోట్లు వెచ్చించడం విశేషం.

మోజెస్ హెన్రిక్స్‌ను తీసుకోలేదు:
బ్యాటింగ్‌లో స్థిరత్వం కోసం ఎంపిక చేసుకున్న మరో ఆటగాడు కేన్ విలియమ్సన్. ప్రతిభ గల బ్యాట్స్‌మన్‌గా, సారథిగా మంచి అనుభవమున్న విలియమ్సన్ ప్రత్యమ్నాయ కెప్టెన్‌గా కూడా సన్‌రైజర్స్‌కు పనికొస్తాడు. ఆల్‌రౌండర్లు బ్రాత్‌వైట్, షకీబ్ అల్ హసన్.. సన్‌రైజర్స్ ఎంపిక చేసుకున్న మరో ఇద్దరు కీలక ఆటగాళ్ళు. ఐతే గత రెండేళ్ళు సన్‌రైజర్స్ విజయాల్లో ముఖ్యభూమిక పోషించిన ఆల్‌రౌండర్ మోజెస్ హెన్రిక్స్ (ఆస్ట్రేలియా)ను వేలం పాటలో సన్‌రైజర్స్ తీసుకోకపోవడం ఊహించనిదే.

పూర్తి స్థాయి బౌలర్లను ఒడిసి పట్టి:
బౌలింగ్ విభాగంపై సన్‌రైజర్స్ బాగా దృష్టిసారించినట్లు వేలం పాటలో ఆ జట్టు అనుసరించిన వ్యూహం స్పష్టంచేస్తుంది. భువనేశ్వర్, సిద్ధార్థ్ కౌల్, సందీప్‌శర్మ, బిల్లీ స్టాన్‌లేక్, బాసిల్ థంపి, రషీద్‌ఖాన్, నటరాజన్, ఖలీల్ అహ్మద్‌లో రూపంలో పూర్తిస్థాయి బౌలర్లను సన్‌రైజర్స్ ఎంపిక చేసుకుంది.

బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిని:
వేలం పాటలో వ్యూహాత్మకంగా వ్యవహరించిన సన్‌రైజర్స్ సత్తాఉన్న ఆటగాళ్ళనే ఎంపిక చేసుకుంది. గత కొన్నేళ్ళుగా బ్యాటింగ్, బౌలింగ్‌లలో జట్టుకు కొండంత అండగా నిలుస్తున్న డేవిడ్ వార్నర్, భువనేశ్వర్‌కుమార్‌లను ముందుగానే రీటెయిన్డ్ చేసుకుంది సన్‌రైజర్స్.

రానున్న సీజన్లో:
8 మంది ఆల్‌రౌండర్లలో మహ్మద్ నబి, జోర్డాన్, బిపుల్‌శర్మ, మెహదీ హసన్‌లు బ్యాట్స్‌మెన్‌కు తక్కువ.. బౌలర్లకు ఎక్కువ. షకీబ్ అల్ హసన్, బ్రాత్‌వైట్‌లు పూర్తిస్థాయి ఆల్‌రౌండర్లు కాగా.. దీపక్ హుడా, యూసుఫ్ పఠాన్ బ్యాటింగ్ ఆల్‌రౌండర్లు. ఈలెక్కన మరే జట్టుకు లేనన్ని విస్తృత బౌలింగ్ వనరులు సన్‌రైజర్స్‌కు ఉన్నట్లే. ఈనేపథ్యంలో రానున్న సీజన్‌లోనూ సన్‌రైజర్స్ దృష్టిలో బౌలర్లే విన్నర్లు..
సన్‌రైజర్స్ హైదరాబాద్
1. డేవిడ్ వార్నర్ (రూ.12 కోట్లు-Retained)
2. భువనేశ్వర్ కుమార్ (రూ.8.5 కోట్లు-Retained)
3. శిఖర్ ధావన్ (రూ.5.2 కోట్లు-RTM)
4. షకీబుల్ హసన్ (రూ.2 కోట్లు)
5. కేన్ విలియమ్సన్ (రూ.3 కోట్లు)
6. కార్లోస్ బ్రేత్‌వైట్ (రూ.2 కోట్లు)
7. యూసుఫ్ పఠాన్ (రూ.1.9 కోట్లు)
8. మనీష్ పాండే (రూ.11 కోట్లు)
9. వృద్ధిమాన్ సాహా (రూ.5 కోట్లు)
10. రషీద్ ఖాన్ (రూ.9 కోట్లు-RTM)
11. రిక్కీ భుయ్ (రూ.20 లక్షలు)
12. దీపక్ హుడా (రూ.3.6 కోట్లు-RTM)
13. సిద్ధార్థ్ కౌల్ (రూ.3.8 కోట్లు)
14. టీ నటరాజన్ (రూ.40 లక్షలు)
15. బేసిల్ థంపి (రూ.95 లక్షలు)
16. సయ్యద్ ఖలీల్ అహ్మద్ (రూ.3 కోట్లు)
17. మహ్మద్ నబీ (రూ.కోటి)
18. సందీప్ శర్మ (రూ.3 కోట్లు)
19. సచిన్ బేబీ (రూ.20 లక్షలు)
20. క్రిస్ జోర్డాన్ (రూ.కోటి)
21. బిల్లీ స్టాన్‌లేక్ (రూ.50 లక్షలు)
22. తన్మయ్ అగర్వాల్ (రూ.20 లక్షలు)
23. శ్రీవత్స గోస్వామి (రూ.కోటి)
24. బిపుల్ శర్మ (రూ.20 లక్షలు)
25. మెహదీ హసన్ (రూ.20 లక్షలు)


Click it and Unblock the Notifications











