
హైదరాబాద్: రాజస్థాన్ రాయల్స్ జట్టు భారతదేశపు ఆటగాడైన స్టువర్ట్ బిన్నీని కొనుగోలు చేసింది. బెంగుళూరులో జరుగుతున్న ఐపీఎల్ 11 సీజన్‌లో భాగంగా మొదటి రోజు శనివారం రాజస్థాన్ జట్టు స్టువర్ట్ బిన్నీని సొంతం చేసుకుంది. రైటు టు మ్యాచ్ కార్డ్ వాడకుండానే జట్టు 50 లక్షలకు బిన్నీని కొనుగోలు చేసింది.
బిన్నీ పెద్ద ఫేమస్ ఆటగాడేం కాదు. కానీ, అతని భార్య సెలబ్రిటీయే. బిన్నీ భార్య మయాంతి లాంగర్ తరచూ భర్తతో సోషల్ మీడియాలో ప్రచారం వల్లే అతనికి ఆ ఫేమ్ దక్కింది.
ఇండియాలోని ప్రముఖ ప్రసార మాధ్యమమైన స్టార్ స్పోర్ట్స్ ఛానెల్‌లో మయాంతి హోస్ట్ గా విధులు నిర్వహిస్తున్నారు. స్టార్ టీవీ ఛానల్ మరో ఐదేళ్ల పాటు ఐపీఎల్ ప్రసార హక్కులను సొంతం చేసుకుంది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.