For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'ఐపీఎల్ వేలం కోసం నేనేమీ నిద్రలేని రాత్రులు గడపడం లేదు'

IPL auction secondary as Shai Hope hopeful of surpassing Virat Kohli, Rohit Sharma

హైదరాబాద్: ఐపీఎల్ వేలం కోసం తానేమీ నిద్రలేని రాత్రులు గడపడం లేదంటూ వెస్టిండిస్ స్టార్ క్రికెటర్ షాయ్ హోప్ వ్యాఖ్యానించాడు. వచ్చే ఐపీఎల్ సీజన్ కోసం డిసెంబర్ 19న కోల్‌కతా వేదికగా ఐపీఎల్ వేలం జరగనుంది. ఈ వేలానికి 971 మంది ఆటగాళ్లు పేర్లను నమోదు చేసుకోగా 332 మంది ఎంపికయ్యారు.

వీరికి సంబంధించిన జాబితాలను బీసీసీఐ అన్ని ఫ్రాంచైజీలకు అందజేసింది. ఈ నేపథ్యంలో పలువురు ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకునే పనిలో పడ్డారు. అయితే తనకు ఐపీఎల్‌ వేలం బెంగ లేదని చెప్పుకొచ్చాడు షాయ్ హోప్. ఐపీఎల్ వేలం తనకు సెకండరీ అని స్పష్టం చేశాడు.

మూడు వన్డేల సిరిస్‌లో భాగంగా భారత్-వెస్టిండిస్ జట్ల మధ్య రెండో వన్డే విశాఖపట్నం వేదికగా జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండో వన్డేకు ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు షాయ్ హోప్ మాట్లాడాడు.

"కచ్చితంగా ఐపీఎల్‌ వేలానికి సంబంధించిన టెన్షన్‌ చాలా మందికి ఉంటుంది. కానీ నాకైతే లేదు. నాకు భారత్‌తో సిరీసే ముఖ్యమైనది. ఇక్కడ పరుగులు చేయడమే నా ముందున్న లక్ష్యం. ఈ క్రమంలోనే కోహ్లీ, రోహిత్‌ల రికార్డులను కూడా బద్దలు కొట్టాలని ఉంది. వారి రికార్డును బ్రేక్‌ చేయాలంటే వారిద్దర్నీ తొందరగా పెవిలియన్‌కు పంపమని మా బౌలర్లను అడగాలి(నవ్వుతూ)" అని అన్నాడు.

కాగా, ఈ ఏడాది అత్యధిక వన్డే పరుగుల జాబితాలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ(1292), రోహిత్‌ శర్మ(1268)లు మొదటి రెండు స్థానాల్లో ఉండగా... షాయ్ హోప్‌(1225) మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. వన్డేల్లో తాను 50 ఓవర్ల పాటు క్రీజ్‌లో ఉండాలని అనుకోననని షాయ్ హోప్ చెప్పుకొచ్చాడు.

"నేను 50 యాభై ఓవర్లు ఆడితే మా ఆటగాళ్లకు మరో 50 ఓవర్లు కావాలి కదా. నేను సాధారణంగా భారీ స్కోరు సాధించడంపైనే దృష్టి పెడతా. ఒక బ్యాట్స్‌మన్‌గా దేశం కోసం ఆడటానికే ఎక్కువ ప్రాధాన్యతిస్తా" అని షాయ్ హోప్ వెల్లడించాడు. చెన్నై వేదికగా జరిగిన తొలి వన్డేలో షాయ్ హోప్‌ సెంచరీ సాధించాడు.

Story first published: Tuesday, December 17, 2019, 18:33 [IST]
Other articles published on Dec 17, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+