
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తొలిరోజు వేలం ముగిసింది. బెంగళూరులోని ఐటీసీ గార్డెనియా హోటల్‌లో జరిగిన ఈ వేలం గురించే తీవ్ర చర్చ జరుగుతోంది. ఆటగాళ్ల వేలం గురించి, ఫ్రాంఛైజీ యాజమాన్యాల గురించి నెటిజన్లు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.
తొలిరోజు వేలంలో సీనియర్లు నిరాశకు గురవగా, ఇంకా అంతర్జాతీయ అరంగేట్రం చేయని యువ క్రికెటర్లు మాత్రం కోట్లు పలికారు. మరోవైపు ఈ వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు హార్భజన్ సింగ్‌ను రూ. 2 కోట్లకు సొంతం చేసుకోగా, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు రవిచంద్రన్ అశ్విన్‌ను రూ. 7.60 కోట్లకు కొనుగోలు చేసింది.
వీరిద్దరూ అటు, ఇటు మారడంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున జోకులు పేలుతున్నాయి. అశ్విన్ సొంత రాష్ట్రం చెన్నై అయినప్పటికీ అతడిని వేలంలో చెన్నై కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపలేదు. దీంతో అశ్విన్‌ను పంజాబ్ జట్టు కొనుగోలు చేసింది. ఇక పంజాబ్‌కు చెందిన భజ్జీని చెన్నై సొంతం చేసుకుంది.
దీంతో వేలంలో హర్భజన్ సింగ్ చెన్నై దక్కించుకోవడంతో ఓ నెటిజన్ 'సర్దార్ తమిళ్‌లో మాట్లాడగలడా' అని ట్వీట్ చేశాడు. 'పంజాబ్‌కు అశ్విన్, తమిళనాడుకు భజ్జీ.. ఇదేదో రెండు రాష్ట్రాల కథలా ఉందే' అంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. ఇలా తొలిరోజు వేలంలో అశ్విన్ అటు, భజ్జీ ఇటు మారడంపై సోషల్ మీడియాలు జోకులు పేలుతున్నాయి: