Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL Auction: వేలానికి ముందే చరిత్ర సృష్టించిన మల్లిక సాగర్.. అసలు ఎవరీ మల్లిక?

ఐపీఎల్ వేలం 2024కి రంగం సిద్ధమైంది. రేపు దుబాయ్ వేదికగా మినీ వేలం ప్రారంభం కానుంది. భారత కాలమాన ప్రకారం మధ్యాహ్నం 1 గంటకు వేలం మొదలవుతుంది. స్టార్ స్పోర్ట్స్‌లో, జియో సినిమాలో లైవ్ చూడొచ్చు. ఈ వేలంలో 333 మంది ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. వీరిలో 214 మంది ఇండియన్ ప్లేయర్స్ కాగా, 119 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. ఖాళీలు 77 మాత్రమే ఉన్నాయి. ఇందులో 30 మంది విదేశీ ప్లేయర్లకు అవకాశం ఉంది.

అయితే ఐపీఎల్ వేలానికి ముందే మల్లిక సాగర్ చరిత్ర సృష్టించింది. ఐపీఎల్ వేలంలో తొలి ఆక్షనీర్‌గా ఆమె రికార్డులకెక్కనుంది. 16 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో వేలాన్ని నిర్వహించనున్న తొలి మహిళ మల్లిక. 2008 నుంచి 2018 వరకు రిచర్డ్ మాడ్లీ వేలంపాటదారిగా బాధ్యతలు నిర్వర్తించాడు. దశాబ్ద కాలం పాటు అతడే వరుసగా ఆక్షన్ నిర్వహించాడు.

IPL Auction: Mallika Sagar created history before IPL 2024 Auction. Who is the Mallika Sagar?

అయితే 2018 నుంచి ఆక్షనీర్‌ బాధ్యత హ్యు ఎడ్మిడ్స్ అందుకున్నాడు. కానీ 2022 మోగా వేలంలో ఎడ్మిడ్స్‌ అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో చారు శర్మ ఆ వేలాన్ని కొనసాగించాడు.ఐపీఎల్ వేలానికి ఆక్షనీర్‌గా పనిచేసిన తొలి ఇండియన్ చారు శర్మగా రికార్డులకెక్కాడు. అయితే ఇప్పుడు మల్లిక సాగర్ తొలి మహిళ ఆక్షనీర్‌గా చరిత్రకెక్కనుంది.

క్రికెట్ లవర్స్‌కు మల్లిక సాగర్ సుపరిచితమే. 48 ఏళ్ల ఆమె ఉమెన్స్ ప్రీమియర్ లీగ్-2023 వేలంతో పాటు డబ్యూపీఎల్ 2024 వేలానికి కూడా ఆమె ఆక్షనీర్‌గా పనిచేసింది. అంతేకాకుండా ప్రోకబడ్డీ లీగ్-2021 నుంచి వరుసగా పీకేఎల్‌లో ఆమె వేలాన్ని నిర్వహిస్తుంది. కాగా, మల్లిక ముంబయికి చెందిన ఆర్ట్ కలెక్టర్. ఆమె తొలుత ఉండోల్ ఆర్ట్ గ్యాలరీలో వేలాన్ని నిర్వహించేది. వేలంలో దాదాపు 25 సంవత్సరాల అనుభవం మల్లిక సొంతం.

ఫ్రాంచైజీల వారీగా అందుబాటులో ఉన్న పర్స్ వాల్యూ
1. చెన్నై సూపర్ కింగ్స్-రూ. 31.4 కోట్లు
2. ఢిల్లీ క్యాపిటల్స్ -రూ.28.95 కోట్లు
3. గుజరాత్ టైటాన్స్ -రూ. 38.15 కోట్లు
4. కేకేఆర్ -రూ. 32.7 కోట్లు
5.ఎల్‌ఎస్‌జీ -రూ. 13.5 కోట్లు
6.ముంబై ఇండియన్స్ -రూ.17.75 కోట్లు
7. పంజాబ్ కింగ్స్ -రూ. 29.1 కోట్లు
8. ఆర్‌సీబీ -రూ.23.25 కోట్లు
9. రాజస్థాన్ రాయల్స్ -రూ. 14.5 కోట్లు
10. ఎస్‌ఆర్‌హెచ్ -రూ. 34 కోట్లు

Story first published: Monday, December 18, 2023, 13:57 [IST]
Other articles published on Dec 18, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+