Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్: పంజాబ్ జట్టుకు యువరాజ్‍‌ను తీసుకుంటామంటున్న సెహ్వాగ్

IPL Auction: Coach Virender Sehwag hints at players who would be on KXIP's radar

హైదరాబాద్: యువీ తిరిగి భారత జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తాడని అనుకుంటున్నారా అన్న ప్రశ్నకు వీరూ సమాధానం చెప్పాడు. 'అది సెలక్టర్లను బట్టి ఉంటుంది. దేశవాళీ క్రికెట్‌లో సత్తాచాటి అన్ని ఫిట్‌నెస్‌ పరీక్షలు పాసైతే ఎందుకు ఎంపిక కాడు? నెహ్రా 36 ఏళ్ల వయసులో ఎంపికైతే యువీ మాత్రం ఎందుకు కాడు' అని అన్నాడు.

'అభిమానులు పంజాబ్‌ స్టార్స్‌ యువరాజ్‌సింగ్‌, హర్భజన్‌ సింగ్‌ను కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ జట్టులో ఉండాలని కోరుకుంటున్నట్టు తెలుస్తోంది' అని సెహ్వాగ్‌ అన్నాడు. యువీలో మునుపటి సత్తా తగ్గిందన్న విమర్శల మాటలను కొట్టిపారేశాడు. 'యువీ టీమిండియాలో లేకపోవచ్చు. కానీ అతనో గొప్ప ఆటగాడు. అతడి ప్రతిభ అమోఘం. ప్రస్తుతం భారత జట్టులో ఆడుతున్న వారూ ఫామ్‌ కోల్పోయే అవకాశాలు ఉన్నాయిగా. యువీలాంటి ఆటగాడు తిరిగి దొరుకుతాడని నేను అనుకోను. అతడు మంచి ఫామ్‌లో ఉంటే జట్టును విజేతగా నిలుపుతాడు' అని వీరూ పేర్కొన్నాడు.

ఈసారి ఐపీఎల్‌లో తాను అన్ని జట్ల నుంచి కళ్లు చెదిరే సిక్సర్లు, భారీ బౌండరీలు చూడాలనుకుంటున్నట్టు వీరూ చెప్పాడు. బెన్‌స్టోక్స్‌, కృనాల్‌ పాండ్య, దీపక్‌ హుడా వంటి ఆటగాళ్లకు భారీ ధర దక్కే అవకాశాలున్నాయని జోస్యం పలికాడు. ఆల్‌రౌండర్‌ అక్షర్‌పటేల్‌ను తాము అన్‌క్యాప్‌ విభాగంలో ఉన్నప్పుడు కొన్నామని అతనిప్పుడు గొప్ప స్థాయిలో ఉన్నాడని పేర్కొన్నాడు. 2014లో తమ జట్టులో సాధారణ ఆటగాళ్లే ఉన్నా ఫైనల్‌కు చేరుకున్నామని ఈ సారి మాత్రం భారీగా ఖర్చు చేస్తామని సెహ్వాగ్‌ తెలిపాడు. ఆర్టీఎం ద్వారా డేవిడ్‌ మిల్లర్‌, మాక్స్‌వెల్‌ను తీసుకుంటామన్నాడు.

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టులోకి అక్సర్ పటేల్‌ను సాధారణ ఆటగాడిగా ఉన్నప్పుడే జట్టులోకి తీసుకున్నామని సెహ్వాగ్ అన్నాడు. ఇప్పుడు అతన్ని రవీంద్ర జడేజా స్థానంలో తీసుకోనున్నట్లు పేర్కొన్నాడు. రైటు టు మ్యాచ్ కార్డు ద్వారా గ్లెన్ మాక్స్‌వెల్, డేవిడ్ మిల్లర్ తీసుకోనున్నట్లు వెల్లడించాడు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Sunday, January 21, 2018, 12:46 [IST]
Other articles published on Jan 21, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+