Jahnavi Mehta: సౌదీ అరేబియాలోని జెడ్డాలో రసవత్తరంగా కొనసాగుతోన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 2025 మెగా ఆక్షన్‌లో తళుక్కున మెరిశారు.. జాహ్నవి మెహతా. కోల్‌కత నైట్ రైడర్స్ ఫ్రాంఛైజీ కో ఓనర్. బాలీవుడ్‌లో ఒక వెలుగు వెలిగిన ఒకప్పటి హీరోయిన్ జుహీచావ్లా- జై మెహతా కుమార్తె.
2022 సీజన్‌తో ఐపీఎల్‌లో అడుగు పెట్టారు. అప్పటి నుంచీ జట్టు వ్యవహారాల్లో కీలకంగా ఉంటోన్నారు. ఐపీఎల్ 2024 సీజన్‌లో కేకేఆర్ ఛాంపియన్‌గా నిలిచిందంటే ప్లేయర్ల ఎంపిక విషయంలో నిక్కచ్చిగా వ్యవహరించడమే. వెంకటేష్ అయ్యర్‌ను రిలీజ్ చేసినప్పటికీ ఈ వేలం పాటలో అతన్ని తీసుకోవడానికి కోట్ల రూపాయలను ఖర్చు పెట్టడం దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్‌గా చెప్పుకోవచ్చు.

వెంకటేష్ అయ్యర్‌పై విన్నింగ్ హార్స్‌గా భావిస్తోన్నారు జాహ్నవి మెహతా. అతని కోసం ఏకంగా 23.75 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టడానికీ వెనుకాడలేదు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు పోటీ పడినప్పటికీ వెనక్కి తగ్గలేదామె. పట్టుబట్టి మరీ వెంకటేష్‌ను జట్టులోకి తీసుకున్నారు.
ఈ లెఫ్ట్ హ్యాండర్ కోసం అటు జాహ్నవి మెహతా, ఇటు ఫ్రాంఛైజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వెంకీ మైసూర్ పట్టుబట్టడానికి కారణాలు లేకపోలేదు. కేకేఆర్ తరఫున రెండు సెంచరీలు చేసిన రెండో బ్యాటర్ అతనొక్కడే. గతంలో ఈ రికార్డు న్యూజిలాండ్ లెజెండరీ బ్యాటర్ మెక్‌కల్లమ్ పేరుమీద ఉండేది. వెంకటేష్ జట్టులో ఉంటే బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ సమతౌల్యంగా ఉంటుందని భావిస్తోంది.