ఐపీఎల్ 2025 మెగా వేలం పాట 2024 నవంబర్ 24,25వ తేదీల్లో జరుగుతుంది.జెడ్డా నగరం వేదికగా జరిగే ఈ మెగా ఈవెంట్ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభం అవుతుంది.ఆస్ట్రేలియా భారత్‌ల మధ్య జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ టెస్ట్ మ్యాచ్ మూడో రోజు ముగిసిన వెంటనే ఈ మెగా ఆక్షన్ ప్రారంభం అవుతుంది.
ఈ సారి ఐపీఎల్‌లో కెప్టెన్లుగా వ్యవహరించిన ముగ్గురు స్టార్ ప్లేయర్లపై అందరి దృష్టి ఉంది. శ్రేయాస్ అయ్యర్,రిషబ్ పంత్, కేఎల్ రాహుల్. వీరిలో శ్రేయాస్ అయ్యర్ కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్‌గా ఐపీఎల్ 2024 టైటిల్ కూడా అందించాడు. వీరంతా మార్కీ సెట్స్‌లో వేలంలో వెళతారు.

రెండు మార్కీ సెట్లలో మొత్తం 12 మంది ఆటగాళ్లుండగా .. ఒక్కో మార్కీ సెట్లో ఆరుగురు చొప్పున ఆటగాళ్లున్నారు. మొత్తంగా 577 మంది ఆటగాళ్లు వేలంపాటలో ఉంటారు. ఇందులో 367 మంది భారత ఆటగాళ్లు ఉండగా 210 మంది ఓవర్సీస్ ఆటగాళ్లున్నారు. మొత్తంగా 204 స్లాట్లు మాత్రమే ఖాళీగా ఉండగా 10 జట్లు ఇందుకోసం వేలంపాటలో పోటీపడతాయి.