కేఎల్ రాహుల్ టీమ్‌లో యార్కర్ల స్పెషలిస్ట్
Mukesh Kumar: ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 2025, 18వ ఎడిషన్ రెండో రోజు మెగా ఆక్షన్ రసవత్తరంగా సాగుతోంది. ఐపీఎల్ ఆడే మొత్తం 10 ఫ్రాంఛైజీలు ఇందులో పాల్గొన్నాయి. 577 మంది ప్లేయర్లల్లో తమకు కావాల్సిన గెలుపు గుర్రాల కోసం పోటీ పడుతోన్నాయి.
ఈ వేలం పాటలో ఫాస్ట్ బౌలర్ ముఖేష్ కుమార్‌ను కొనుగోలు చేసింది ఢిల్లీ కేపిటల్స్. ముందు నుంచి కూడా ఇదే టీమ్‌లో ఆడుతున్నాడు. అతన్ని వదలదలచుకోలేదు డీసీ. దీనికోసం 8 కోట్ల రూపాయలను అతనిపై ఇన్వెస్ట్ చేసింది. రైట్ టు మ్యాచ్‌ను కూడా ప్రయోగించింది. తన వద్ద ఉన్న ఒకే ఒక్క ఆర్టీఎం సౌకర్యాన్ని ముఖేష్ కుమార్ కోసం వినియోగించిందంటే అతనిపై ఎంత నమ్మకం ఉంచిందో అర్థం చేసుకోవచ్చు.

యార్కర్లు, డెత్ ఓవర్ల స్పెషలిస్ట్‌గా గుర్తింపు ఉంది ముఖేష్ కుమార్‌కు. ఐపీఎల్‌లో ఇప్పటివరకు 20 మ్యాచ్‌లల్లో 24 వికెట్లు పడగొట్టాడు. 2023, 2024 సీజన్లల్లో 10 చొప్పున మ్యాచ్‌లను ఆడిన ఈ బౌలర్.. వరుసగా 7, 17 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. నిలకడగా రాణిస్తోన్నాడు. 3/14 అతని బెస్ట్ బౌలింగ్ ఫిగర్.
ముఖేష్ కుమార్ కొనుగోలు చేయడానికి తొలుత పంజాబ్ కింగ్స్ ప్రయత్నించింది. ఢిల్లీ కేపిటల్స్‌తో పోరాడింది. ఒకదశలో పంజాబ్ కింగ్స్ ఆరున్నర కోట్ల రూపాయలకు బిడ్డింగ్ ఫైనల్ చేసుకుంది కూడా. ఈ దశలో డీసీ మేనేజ్‌మెంట్.. రైట్ టు మ్యాచ్ కార్డ్‌ను ప్రయోగించింది. 8 కోట్ల రూపాయలకు అతన్ని దక్కించుకుంది.
ఇప్పటికే మిఛెల్ స్టార్క్ ఈ టీమ్‌లో ఉన్నాడు. అతనితో కలిసి కొత్త బంతిని పంచుకుంటాడు ముఖేష్ కుమార్. కేఎల్ రాహుల్ దాదాపుగా కేప్టెన్‌గా అపాయింట్ అవుతాడంటూ ప్రచారం జరుగుతున్న వేళ.. అతణ్ని ఎలా వినియోగించుకుంటాడనేది ఆసక్తికరంగా మారింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications